-
డీకే శివకుమార్ కు షాక్..
-
మంత్రి పదవికి కీలక నేత రాజీనామా…!
Crime Mirror, Latest News Updates: కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్ ప్రయాణం సాఫీగా సాగేటట్టు కనిపించడం లేదు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలనుంచి తప్పుకొని డీకే శివకుమార్కు అప్పగించిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలను చేపట్టారు.
అధిష్టానం ఆదేశాలతో అసంతృప్తిగానే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న సిద్ధరామయ్య నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించదన్న ఊహాగానాలు తొలగించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ ప్రయాణం సాఫీగా సాగుతుంది అన్న అభిప్రాయం చాలామందిలో నెలకొంది. అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు తొలి కుదుపు ఎదురయింది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్ తోపాటు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామలింగారెడ్డి తన పదవికి తాజాగా రాజీనామా చేశారు. ఆయన తొలి నుంచి నగరాభివృద్ధి శాఖ ఇవ్వాలని కోరుతూ వచ్చారు. ఆ శాఖను కాకుండా నీటిపారుదల శాఖను అప్పగించడంతో అసహనాన్ని వ్యక్తం చేసిన ఆయన తాజాగా రాజీనామా చేశారు. 13 మందితో కొత్త మంత్రివర్గంతో డీకే శివకుమార్ కొలువుదీరారు. వీరిలో రామ రంగారెడ్డి కూడా ఒకరు.
శాఖ కేటాయింపు విషయంలో తొలి నుంచి అసంతృప్తితో ఉన్న ఆయన రాధాగా మీడియా ఎదుట తన రాజీనామా లేఖపై సంతకం చేశారు. నగరాభివృద్ధి శాఖ కేటాయిస్తానని డీకే హామీ ఇచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తాను ముఖ్యమంత్రిని ఏ శాఖ అడగలేదని, ఆయనే తనకు శాఖను ప్రతిపాదించారని పేర్కొన్నారు.
కానీ తరువాత నీటిపారుదల శాఖను కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ శాఖ తనకు ఆమోదయోగం కాదన్న ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నట్లు ఈ సందర్భంగా రామలింగారెడ్డి పేర్కొన్నారు. ఇక తాను ఏ మంత్రిత్వ శాఖను ఆఫర్ చేసిన తీసుకోబోనని ఆయన స్పష్టం చేశారు.
ముందు ముందు మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్కు రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. తాజాగా ఈ పరిణామాలపై బీజేపీ కూడా స్పందించింది. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి పెరుగుతాయని, ముఖ్యమంత్రి మార్పు ఆ పార్టీకి ఏమాత్రం ఉపయోగపడదని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం అలాంటిది ఏమీలేదని పేర్కొంది.
తమ పార్టీకి, రాష్ట్రానికి ముఖ్యమైన నేత రామలింగారెడ్డి అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రామలింగ రెడ్డి రాజీనామా వ్యవహారం కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కీలకమైన పరిణామంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డీకే శివకుమార్ ప్రయాణం ఒడిదుడుకులతో సాగుతుంది అనడానికి తాజా మంత్రి రాజీనామా ఉదాహరణగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో డీకే శివకుమార్ కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఒక వర్గం నుంచి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. సీఎల్పీ సమావేశంలో శాసనసభ పక్ష నేతగా శివకుమార్ పేరని ప్రతిపాదించేందుకు సిద్ధరామయ్య తొలుత అంగీకరించలేదు. దీన్నిబట్టే ఆ పార్టీలో ఉన్న ఇబ్బందుకర పరిస్థితులను అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు.
ఏదిఏమైనా స్వపక్షంలోనే విపక్షాన్ని డీకే శివకుమార్ రానున్న రోజుల్లో ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఈ సవాళ్లను ఎదుర్కొంటూ డీకే శివకుమార్ తన రెండేళ్ల పదవీ కాలాన్ని ఎలా పూర్తి చేస్తారో చూడాల్సి ఉంది.