మాదాపూర్,క్రైమ్ మిర్రర్ :- తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మాదాపూర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…పదుల సంఖ్యలో సాగిన పోరాటాలు, వందలాది మంది అమరవీరుల త్యాగాల ఫలమే నేటి స్వరాష్ట్రం. ఎందరో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరిన ఈ పవిత్రమైన రోజున, తెలంగాణను మరింత ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లడానికి మనమంతా పునరంకితం కావాలి. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, ఉమ్మడి మాదాపూర్ డివిజన్ ప్రజలందరికీ ప్రగతిశీల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని పార్టీ ముఖ్య నాయకులు బిక్షపతి ముదిరాజ్.మధుసూదన్ రెడ్డి,రాధాకృష్ణ రెడ్డి, నాదిశ్వర్, రమేష్ రెడ్డి, పోల్ రెడ్డి ,వెంకటేశ్వరావు, రాఘవ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి,రహీమ్ షా అలీ,రాహుల్, శ్రీను,బాబు భాయ్,శారీఫ్,సలీమ్ ఖాన్,షేక్ ఇమ్రాన్, షేక్ బాబు మియా, గౌస్, రావుఫ్,సలీమ్, ఇమ్రాన్, అరవింద్,నర్సింహా, రామకృష్ణ, సుధాకర్, చిన్న నర్సింహా, రాజు,బాలరాజు, సలీమ్ భాయ్, వసంత్ నాయుడు, వినోద్ రెడ్డి, భరత్ రెడ్డి,కృష్ణం రాజు, అభి, రాజు, నీలేష్, శ్రీకాంత్, బంటీ,అఖిల్,వినోద్ యాదవ్, మరియు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సమ్మర్ స్పెషల్.. బీర్లతో ఎన్ని వేల కోట్ల ఆదాయమంటే..?
Papaya in Breakfast: ఉదయాన్నే ఈ ఒక్క పండు తింటే అందం, ఆరోగ్యం మీ సొంతం…!