సంగారెడ్డి, క్రైమ్ మిర్రర్: సంగారెడ్డి జిల్లాలో మహిళ హత్య కేసులో ట్విస్ట్ ఏర్పడింది. భర్తే హత్య చేసి.. గుర్తు తెలియని వ్యక్తులు చంపారని నాటకం ఆడినట్లు పోలీసులు తేల్చివేసారు. తామిద్దరం మార్కెట్ కు వెళ్లి తిరిగి వస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి, కత్తులతో దాడి చేసి, అతని ముందే భార్య మీనా దేవి గొంతు కోసి హత్య చేశారని పోలీసులకు భర్త అనిల్ కుమార్ తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో అతని మాటల్లో పొంతన లేకపోవడంతో.. పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో, తానే తన భార్య మీనాదేవిని గొంతు కోసి చంపానని ఒప్పుకున్నాడు. దంపతులు గత 20 ఏళ్లుగా వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నారు. భార్య హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.