Homeతెలంగాణవ్యవసాయ మోటార్లకు మీటర్ల రగడ!

వ్యవసాయ మోటార్లకు మీటర్ల రగడ!

•సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటన చేయాలని కవిత డిమాండ్
•లూప్ హోల్స్ వెతకొద్దు అంటూ సూచన

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-
తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటు పై రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయబోమని ఆయన తేల్చి చెప్పారు. అలాగే పెట్టకపోతే భారత రాష్ట్ర సమితి పోటీ చేయకూడదు అని సవాల్ చేశారు. దీనిపై టిఆర్ఎస్ అధినేత కవిత స్పందించారు. ఇటువంటి నిర్ణయాలను జర్నలిస్టులతో చిప్ చాట్ తో కాదు.. మీడియా సమావేశం పెట్టి అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 24 గంటలపాటు రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని బాహటంగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. ఇవన్నీ కాకమ్మ కబుర్లుగా తేల్చేశారు.

ఆఫ్ ది రికార్డు ముచ్చట్లు వద్దు..
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు కవిత. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న ఇలాంటి ఆఫ్ ది రికార్డు ముచ్చట్లను తెలంగాణ ప్రజలు గాని.. రైతులు కానీ నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో పల్లెల్లో బహిరంగంగా ఇచ్చిన అనేక గ్యారెంటీలను, హామీలను ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన మాట తప్పిన ప్రభుత్వం అని విమర్శించారు. మైకుల ముందు చెప్పిన పెద్ద పెద్ద వాగ్దానాలుకే దిక్కు లేదని.. జర్నలిస్టులతో క్యాజువల్ గా మాట్లాడే చిట్ చాట్ ముచ్చట్లను రైతాంగం ఎలా నమ్ముతుందని కవిత ప్రశ్నించారు. ప్రస్తుతం కవిత కామెంట్స్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి.

ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి..
తెలంగాణలో వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్ల బిగించడం పై అధికార కాంగ్రెస్ వర్సెస్ భారత రాష్ట్ర సమితి అన్నట్టు ఉంది. తాము సైతం రైతుల పక్షమేనని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పిన నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కవిత భిన్నంగా స్పందించారు. ప్రభుత్వానికి నిజంగానే రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే.. తెర వెనుక మాటలు ఆడకుండా.. అధికారికంగా ప్రకటన చేయాలని సవాల్ చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి కెమెరాలు ముందు చెబితేనే ఆ మాటలకు చట్టబద్ధత, జవాబుదారితనం ఉంటుందన్నారు. గతంలో అనేక సందర్భాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు మోటార్లకు మీటర్లు వ్యవహారం పై ఆందోళన చెందుతున్నారని.. ఈ గందరగోళానికి తరలించాల్సిన బాధ్యత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పై ఉందని కవిత అన్నారు. ఉచిత విద్యుత్, వ్యవసాయ సబ్సిడీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు విధించిందని.. దీనిలో సైతం లూప్ హోల్స్ వెతికే పనిలో ఉందని ఎద్దేవా చేశారు కవిత. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగ సమస్యలపై తెలంగాణ రాష్ట్ర సేన ఉద్యమిస్తుందని కూడా ఆమె స్పష్టం చేశారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు