Homeతెలంగాణబీఆర్‌ఎస్‌ నేతలకు సీఎం రేవంత్‌ సవాల్‌.. ఎన్నికల్లో పోటీ చేయమని కామెంట్‌.!

బీఆర్‌ఎస్‌ నేతలకు సీఎం రేవంత్‌ సవాల్‌.. ఎన్నికల్లో పోటీ చేయమని కామెంట్‌.!

క్రైమ్ మిర్రర్, పాలిటిక్స్:- బీఆర్‌ఎస్‌ నేతలకు సీఎం రేవంత్‌ రెడ్డి స్ర్టాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమైతే తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని, దీనికి బీఆర్‌ఎస్‌ నేతలు సిద్ధమా.? అంటూ సీఎం సవాల్‌ విసిరారు. కొద్దిరోజులుగా బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన తాజాగా స్పందించారు. మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్‌ నిలిపేసినా తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఒక వేళ మోటార్లకు మీటర్లు పెట్టకపోయినా, ఉచిత విద్యుత్‌ కొనసాగించినా ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్‌ఎస్‌ తప్పుకుంటుందా.? అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ రాష్ట్ర సమితి నేతలు రాజకీయ లబ్ధి కోసం ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని, కేసీఆర్‌ రైతుల ముసుగులో లైఫ్‌ లైన్‌ కోసం ప్రయత్నిస్తున్నారని తీవ్రస్థాయిలో సీఎం మండిపడ్డారు. రైతులకు 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించే విషయంలో వెనక్కి తగ్గబోమని రేవంత్‌ స్పష్టం చేశారు. దేశంలోనే తొలిసారిగా ఎక్కడా లేని విధంగా రైతు డిస్కమ్‌ను ఏర్పాటు చేశామన్న ఆయన.. రైతు డిస్కమ్‌ ఏర్పాటుతో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు.

అబద్దాల పునాదులపై బీజేపీ, బీఆర్‌ఎస్‌..

ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌ రెడ్డి భారతీయ జనతా పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు అబద్దాల పునాదులపై పార్టీలను బతికించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డిపైనా తీవ్రస్థాయిలో విమర్శలను సీఎం రేవంత్‌ రెడ్డి గుప్పించారు. వడ్డు కొనంది మీరు, రైతు పండించిన ప్రతి గింజను తమ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని, మేం కొనుగోలు చేస్తున్నది ఎంత, కేంద్రం కొనుగోలు చేస్తున్నది ఎంత అన్నది తేల్చాలన్నారు. కేంద్రం ఒక్క గింజ కూడా కొనుగోలు చేయడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి.. వరి, జొన్న, మొక్క జొన్నలు మొత్తం తమ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. కేంద్రం కొనుగోలు చేయాల్సిన పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని, కేంద్ర విధానం వల్ల రాష్ట్రంలో రైతులు గోస పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం కొనుగోలు చేయకపోతే బస్సులు వేసుకుని వెళ్లిన వాళ్ల దగ్గరికే ట్రాక్టర్లు వేసుకుని వెళతామని, జల వివాదాలను రాష్ట్రం సమయన్వయంతో పరిష్కరించుకోవాలని మోదీ చెప్పారని, కానీ, తుమ్మిడిహట్టి కోసం కలిసి మాట్లాడడానికి మహరాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్‌ మెంట్‌ కోరినా స్పందించడం లేదంటూ రేవంత్‌ గ్రాహాన్ని వ్యక్తం చేశారు. రైతులు పేరుతో ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలని, రైతులకు మేలు చేస్తున్న ప్రభుత్వం తమదని ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు