Homeతెలంగాణదూసుక‌పోతున్న అప్ని హద్ద్ సే' చిత్రంలోని 'తేరా హీ కరమ్' పాట...! 6మిలియ‌న్ వ్యూస్‌తో సెన్స‌ష‌న్...

దూసుక‌పోతున్న అప్ని హద్ద్ సే’ చిత్రంలోని ‘తేరా హీ కరమ్’ పాట…! 6మిలియ‌న్ వ్యూస్‌తో సెన్స‌ష‌న్ క్రియేట్‌…

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: ‘అప్ని హద్ద్ సే’ చిత్రంలోని పాటకు లభిస్తున్న విశేష స్పందనను చిత్ర హీరో నజీర్ సినిమా మరియు సాంగ్ విశేషాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘తేరా హీ కరమ్ తేరా సహారా చాహియే’ అనే పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కేవలం 3 మిలియన్ల రీచ్‌తో మొదలైన ఈ పాట, ప్రస్తుతం ప్రేక్షకుల అమితమైన ఆదరణతో ఏకంగా 6 మిలియన్ మైలురాయిని చేరువలో ఉంది . ఈ పాట సోషల్ మీడియాలోనూ, మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ట్రెండింగ్‌లో ఉంటూ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ఈ కార్యక్రమంలో ఎడిటర్ జమీర్ షేక్ మాట్లాడుతూ, పాట నిర్మాణంలోని తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ: “ఒక పాటను ఎడిట్ చేయడంలో భావోద్వేగమే ప్రధానమైనది. సంగీతానికి మరియు లిరిక్స్‌కు తగినట్లుగా విజువల్స్‌ను పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేయడానికి నేను మూడు వేర్వేరు వెర్షన్‌లపై పనిచేశాను. గీత రచయిత నజీర్ గారి సాహిత్యం, నటీనటుల అభినయం, మరియు మా టీమ్ సమన్వయం వల్లే ఈ పాట ఇంతటి ఘనవిజయాన్ని అందుకుంది. ఈ గొప్ప అవకాశం కల్పించిన ‘లూమినస్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు,” అని తెలిపారు. ప్రేక్షకులు తమ పాటకు అందిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పాట సాగుతున్న వేగం చూస్తుంటే, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సృష్టిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు