Homeతెలంగాణవ్యక్తిగత స్వార్థం వల్ల గుడి పరిసరాలు కలుషితం చేయొద్దు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

వ్యక్తిగత స్వార్థం వల్ల గుడి పరిసరాలు కలుషితం చేయొద్దు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

•ప్రతి ఒక్కరు గుడి విషయంలో నిస్వార్ధంగా పారదర్శకంగా ప్రవర్తించాలి : MLA రాజగోపాల్ రెడ్డి

మునుగోడు,క్రైమ్ మిర్రర్:- దైవ దర్శనంతోనే ప్రతి మనిషిలో సానుకూల దృక్పథం అలవాటు అవుతుందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని పురాతన శివరామ క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దైవ అనుగ్రహం లేనిది ఏది జరగదని గుడి ముందు అందరూ సమానులేనని గుడి వ్యవహారంలో రాజకీయాలు చేయొద్దని స్థానికులకు తెలిపారు… సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే ప్రతిదీ సానుకూలంగానే ఉంటుందని,నెగటివ్ ఆలోచన చేస్తే ప్రతిదీ ఇబ్బందిగానే ఉంటుందని హితవు పలికారు. గుడిలో దాని పరిసరాలలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావన విరాజిల్లుతు ఉంటుందని ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత స్వార్థం వల్ల గుడి వాతావరణాన్ని కలుషితం చేయొద్దన్నారు.గుడి విషయంలో ప్రతి ఒక్కరు నిస్వార్ధంగా పారదర్శకంగా భక్తి భావంతో మెలగాలి అని సూచించారు..మాజీ డిసిసిబి చైర్మెన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి,సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్,మాజీ ఆలయ చైర్మన్లు పాల్వాయి యాదగిరి రెడ్డి,చెన్నారెడ్డి,మాజీ ఎంపీపీ కర్నాటి స్వామి,మాజీ సర్పంచులు,పందుల నరసింహ, మిరియాల వెంకటేశ్వర్లు,,యడవల్లి సురేష్ కుమార్,జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి,,మాజీ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జితేందర్ రెడ్డి,ఉప్పునూతల సత్యనారాయణ,ఆరేళ్ల సైదులు,కాంగ్రెస్ నాయకులు ముచ్చపోతుల నరసింహ,జిట్టగోని యాదయ్య,పందుల భాస్కర్, ఎండి అన్వర్,,పందుల రాజేష్, జాల మణి,యాసరాని దినేష్,యాదయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.

అత్యవసర ప్రయాణం.. టికెట్ లేకపోయినా ట్రైన్ ఎక్కే మార్గం ఇదే!

జుట్టు బలంగా ఉండాలంటే వారానికి ఎన్నిసార్లు నూనె రాయాలి?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు