Homeఆంధ్ర ప్రదేశ్నాలెడ్జి ఎకానమీని అంది పుచ్చుకోవాలి...సీఎం చంద్ర‌బాబు...!

నాలెడ్జి ఎకానమీని అంది పుచ్చుకోవాలి…సీఎం చంద్ర‌బాబు…!

విజయవాడ,క్రైమ్‌మిర్ర‌ర్‌: విజయవాడలోని ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. చంద్రబాబు మాట్లాడుతూ డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ పేరిట ఓ కళావేదికను ఇవాళ ప్రారంభించుకుని ఎంఎస్ఎంఈ సమ్మిట్ 2026 నిర్వహిస్తున్నాం. 4.4 ఎకరాల్లో 1.45 చదరపు అడుగుల స్థలం లో ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మించాం. ఓ చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమ గా మార్చే అవకాశం ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఉంది. దేశంలో వ్యవసాయం తరవాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం ఇదేనని అన్నారు.

ఏపీలో వనరులు వినియోగించుకునేలా ఎం ఎస్ ఎం ఈ లకు అందుబాటులోకి తెచ్చాం. ఎంఎస్ఎంఈ పాలసీతో పాటు ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీలు తీసుకువచ్చాం. ఈ సమ్మిట్ ద్వారా స్టార్టప్లు, పారిశ్రామిక యూనిట్లు, నిపుణులు, బ్యాంకులు ఒకే వేదిక పైకి వచ్చాయి.వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కింద పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలి. రూ.500 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలు కూడా ఇప్పటికే విడుదల చేశాం. రూ.200 కోట్లతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ప్రారంభిస్తున్నాం.

ప్రతీ నియోజకవర్గంలో ఒక ఏంఎస్ఎంఈ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ శంకుస్థాపన చేసిన 38 పార్కులతో పాటు వంద పార్కులకు ఇప్పటికే శంకుస్థాపన చేశాం. ఎలాంటి వివాధాలు లేకుండా ఈ పారిశ్రామిక పార్కులకు భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు. ప్రైవేటు పారిశ్రామిక పార్కుల కు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తాం. శ్రీసిటీ విజయవంతమైన పారిశ్రామిక పార్క్. రూ.28 వేల కోట్ల కార్పస్ ఫండ్ డ్వాక్రా మహిళల సంఘాల వద్ద ఉంది. ఈ ఏడాది 5 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలను ఎంటర్ ప్రెన్యుర్లు గా మారుస్తాం.

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లను ప్రోత్సహిస్తాం. ఏపీ నుంచి వంద యునికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చేది నాలెడ్జ్ ఎకానమీ దీనిని అందిపుచ్చుకోవాలని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు