Homeఆంధ్ర ప్రదేశ్హోం మంత్రి అనిత ఇలాకాలో దారుణం...మైన‌ర్ బాలిక‌ కాళ్లు చేతులు క‌ట్టేసి అత్యాచారం...!

హోం మంత్రి అనిత ఇలాకాలో దారుణం…మైన‌ర్ బాలిక‌ కాళ్లు చేతులు క‌ట్టేసి అత్యాచారం…!

అనకాపల్లి, క్రైమ్‌మిర్ర‌ర్‌: హోం మంత్రి అనిత ఇలాకాలో దళిత మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. 7వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక (11)ను కాళ్ళు, చేతులు కట్టేసి అత్యాచారం చేసారు. నిందితులు చిన్నబ్బాయి, జోగి రాజుపై పాయకరావుపేట పీ ఎస్‌లో పోక్సో కేసు నమోదు అయింది.

కాగా ఈ ఘ‌ట‌న ఈ నెల‌17న జ‌రిగింది. విషయం ఎవరికైనా చెబితే బాధితురాలిని చంపేస్తామని బెదిరింపులకు గురిచేసారు. బాధిత బాలిక తల్లి ఈనెల 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. హోంమంత్రి నియోజకవర్గం కావడంతో కేసు వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాజావార్తలు