హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. తాను రాసిన పాత్రల్లోనే అత్యంత క్రూరమైన, డార్క్ విలన్ రోల్ లూగర్ అని చెప్పారు. ఎన్టీఆర్ ఈ పాత్ర కోసం కేవలం 4 నెలల్లో 15 కేజీల బరువు తగ్గారని వెల్లడించారు.జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ ‘NTR Neel’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకున్న ఈ చిత్రానికి, అఫీషియల్ టైటిల్ అనౌన్స్ చేశారు. తారక్ బర్త్ డే స్పెషల్ గా గ్లింప్స్ రిలీజ్ చేశారు.
‘డెవిల్ జన్మించాడు’ అంటూ వచ్చిన ఈ వీడియో అంచనాలు రెట్టింపు చేసింది. ఇప్పటి వరకూ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ షూటింగ్ చేస్తున్న ప్రశాంత్ నీల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.’డ్రాగన్’ సినిమాలో నటించడానికి ఓకే చెప్పడం ఎన్టీఆర్ తీసుకున్న మోస్ట్ డిఫికల్ట్ డెసిజన్స్ లో ఒకటని ప్రశాంత్ నీల్ అన్నారు. ఇప్పటి వరకూ తాను రాసిన క్యారెక్టర్లలో మోస్ట్ డార్క్ క్యారెక్టర్.. ఈ సినిమాలో తారక్ పోషించిన లూగర్ పాత్ర అని పేర్కొన్నారు. ఇండియన్ సినిమాలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ విలన్స్ ఈ సినిమాలో నటిస్తున్నారని, తాను రాసిన పవర్‌ఫుల్ విలన్ రోల్స్‌లో లూగర్ ఒకటని తెలిపారు.
ఆడియన్స్ ని మిస్ లీడ్ చేయకూడదని అనుకున్నానని, అందుకే ఆఫ్ఘన్ ట్రేడ్ కంపెనీలో ఎన్టీఆర్ కూడా ఒక విలన్ అని, అది గ్లింప్స్ లో వెల్లడించామని చెప్పారు.3 నిమిషాల ‘డ్రాగన్’ గ్లింప్స్ రిలీజ్ చేయడం గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ”ఈ సినిమాకు సంబంధించిన సమాచారాన్ని మేము వెల్లడించడం ఇదే మొదటిసారి. ఒక కథ చెప్పడం ప్రారంభించాక, ప్రేక్షకులు ఆ కథతో మమేకమవ్వాలని కోరుకుంటారు. అందుకే మేము ఏం చెప్పాలనుకుంటున్నాము.. ప్రేక్షకులు ఏం వింటున్నారు అనే అంశాలపైనే దృష్టి సారించడం ఉత్తమమని నేను భావించాను. దీని వెనుక వేరే ఉద్దేశం ఏదీ లేదు. ఇది కేవలం మా సినిమా గురించి చెప్పడానికి మాత్రమే” అని తెలిపారు.
”నేను గత 25 ఏళ్లుగా ఎన్టీఆర్‌కు పెద్ద అభిమానిని. ఆయన నటించిన మాస్ సినిమాలన్నీ చూశాను.
ఫైనల్‌గా ఆయన్న డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. ఐదేళ్ల క్రితం తొలిసారి మేం మీట్ అయ్యాం. అప్పుడు స్టోరీ లైన్ చెప్పాను. ఏ క్యారెక్టర్ అయినా రైటా? రాంగా? అనేది ఆలోచించలేదు.. డ్రామా పండుతుందా లేదా? అనేదే చూశారు. అలా కథ పూర్తి చేసేందుకు నాకు మూడు సంవత్సరాలు పట్టింది. ఒక పెద్ద హీరో ఇలాంటి క్యారక్టర్ చేయడం పెద్ద రిస్క్ అని తెలిసినా అంగీకరించారు. ఇది ఆయన తీసుకున్న మోస్ట్ డిఫికల్ట్ డెసిజన్స్ లో ఒకటి” అని ప్రశాంత్ నీల్ చెప్పారు. తుపాకీ పేరైన లూగర్‌ను తారక్ క్యారెక్టర్‌కు ఎందుకు పెట్టామన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందేనన్నారు.’లూగర్ పాత్ర కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారు.
కేవలం 4 నెలల్లోనే 15 కిలోల బరువు తగ్గారు. ఆయన్ని చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఆయన చాలా బలహీనంగా, పాలిపోయినట్లుగా, అనారోగ్యంతో ఉన్నట్లు కనిపించడం మొదలుపెట్టారు. వెంటనే బరువు తగ్గడం ఆపమని చెప్పినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఆయన భార్యతో సహా నా టీంలోని వారందరూ నాపై అసహనం వ్యక్తం చేశారు. కానీ ఆయన మాత్రం బరువు తగ్గడం ఆపలేదు. నా విజన్ కోసం తాను ఏదైనా చేస్తానని చెప్పారు. పని పట్ల ఆయన డెడికేషన్ అలాంటిది. ఈ కథలోని డ్రామా పార్ట్‌ను మేం ఇద్దరం కలిసి రాశాం” అని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.