సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై ప్రేమ, డేటింగ్ వార్తలు రావడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ గురించి సోషల్ మీడియాలో తరచూ రూమర్లు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి వార్తలతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఆమె పేరు యువ క్రికెటర్ తిలక్ వర్మతో కలిసి వినిపిస్తోంది.
తిలక్ వర్మతో శ్రీలీల ప్రేమాయణం!
కొంతకాలంగా శ్రీలీల, తిలక్ వర్మ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ గత ఏడాది నుంచే దగ్గరయ్యారని, ప్రస్తుతం సీరియస్ రిలేషన్‌లో ఉన్నారని టాక్ నడుస్తోంది. దీనికి కారణంగా కొన్ని సంఘటనలను అభిమానులు చూపిస్తున్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
గత ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీలీల తన తల్లితో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. అదే సమయంలో తిలక్ వర్మ కూడా తన కుటుంబంతో తిరుమలలో కనిపించాడు. అప్పట్లో ఈ విషయం పెద్దగా చర్చకు రాకపోయినా, ఇప్పుడు ఆ ఫోటోలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో కూడా ఈ వార్తలు మరింత బలపడ్డాయి. ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా శ్రీలీల తల్లి ప్లేయర్స్ ఫ్యామిలీతో కనిపించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్ కు శ్రీలీల హాజరైనట్లు వార్తలు వచ్చాయి. ఆమెతో ఉన్న టీమ్ లో ఒకరు తిలక్ వర్మ జెర్సీ ధరించడం కూడా చర్చకు దారితీసింది.
త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా?
ఇంతేకాకుండా తిలక్ వర్మ సన్నిహితులు కూడా అతను ప్రేమలో ఉన్నాడని చెప్పారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీరిద్దరి రిలేషన్‌పై మరింత ఆసక్తి పెరిగింది. కొందరు అయితే త్వరలోనే పెళ్లి కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో ఇప్పటివరకు స్పష్టత లేదు. శ్రీలీల, తిలక్ వర్మ అధికారికంగా స్పందించలేదు.
ఇక కెరీర్ విషయానికి వస్తే, శ్రీలీల ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్‌లో కూడా అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.