Homeసినిమాఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్.. 4 నిమిషాల 35 సెకన్ల డ్రాగన్ గ్లింప్స్...

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్.. 4 నిమిషాల 35 సెకన్ల డ్రాగన్ గ్లింప్స్ రెడీ!

క్రైమ్ మిర్రర్, సినిమా:- జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మేకర్స్ అదిరిపోయే గిఫ్ట్ సిద్ధం చేశారు. ప్రస్తుతం డ్రాగన్ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ నుంచి ఎప్పుడెప్పుడు అప్‌డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ వెయిటింగ్‌కు ఫుల్ మాస్ ట్రీట్ ఇవ్వడానికి మూవీ టీమ్ సిద్ధమైంది.
మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 19 అర్ధరాత్రి ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్ విడుదల కానున్నట్లు సమాచారం. అయితే ఈ గ్లింప్స్‌కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా గ్లింప్స్ అంటే 30 సెకన్లు లేదా ఒక నిమిషం నిడివి మాత్రమే ఉంటుంది. కానీ డ్రాగన్ కోసం మాత్రం ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల భారీ గ్లింప్స్ సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

మొత్తం 275 సెకన్ల నిడివితో రూపొందించిన ఈ గ్లింప్స్ ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుందని సమాచారం. అంతేకాదు, ఈ సెన్సార్ రిపోర్ట్ ద్వారానే మూవీ టైటిల్‌ను కూడా అధికారికంగా కన్ఫార్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రం ఇప్పుడు డ్రాగన్ పేరుతోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ గ్లింప్స్‌కు U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వడం కూడా ఆసక్తిని పెంచుతోంది. ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, రక్తపాతం, పవర్‌ఫుల్ విజువల్స్‌తో గ్లింప్స్ నిండిపోయి ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్, ఇంటెన్స్ లుక్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది.

కేజీఎఫ్, సలార్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్‌తో కలిసి మరో భారీ బ్లాక్‌బస్టర్‌ను ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో #DragonGlimpse, #NTRBirthdayCelebrations హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.ఈ గ్లింప్స్ విడుదలతో సినిమా హైప్ మరోస్థాయికి వెళ్లడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ పాత్రల్లో ఇది ఒకటిగా నిలవొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మే 19 అర్ధరాత్రి విడుదల కానున్న ఈ మాస్ గ్లింప్స్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు