క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్‌లోని పంజాగుట్ట ఫ్లైఓవర్ సమీపంలో పట్టపగలే రూ.15 లక్షల నగదు ఉన్న బ్యాగ్ చోరీకి గురైంది. ఈ కేసును పంజాగుట్ట పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి, సీసీటీవీ (CCTV) దృశ్యాల ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్న అఫ్షద్ (అఫ్షన్) అనే వ్యక్తి బ్యాంకులో నగదు డిపాజిట్ చేయడానికి వెళ్తూ దారిలో ఆగారు.
పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద ఉన్న ‘గణేష్ స్టాంప్స్ అండ్ కో’ దుకాణం వద్ద అఫ్షద్ తన నగదు బ్యాగ్‌ను కుర్చీలో పెట్టారు. ఆయన ఏమరపాటుగా ఉన్న సమయాన్ని చూసి దుండగులు ఆ రూ. 15 లక్షల బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. పోలీసుల ప్రాథమిక విచారణలో బాధితుడైన అఫ్షద్ మిత్రుడే ఈ చోరీకి మాస్టర్ ప్లాన్ వేసినట్లు తేలింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.