Homeఆంధ్ర ప్రదేశ్బోర్ల త‌వ్వ‌కాలు బంద్‌...ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం...!

బోర్ల త‌వ్వ‌కాలు బంద్‌…ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం…!

కడప, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఏపీ ప్ర‌భుత్వం కొత్త‌గా బోర్ల త‌వ్వ‌కాలు లేకుండా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బోర్ల త‌వ్వ‌కాలు లేకుండా నిషేదం విధించింది. మొత్తం 7 జిల్లాల్లోని 258 గ్రామాల్లో బోర్ల తవ్వకాలను నిషేధించారు. కాని తాగునీటి అవ‌స‌రాల కోసం మిన‌హాయింపు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకపోతే జనాల కోసం తాగునీటి అవసరాలకోసం మాత్రం బోర్లు వేసుకోవచ్చు. ఈ జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతుండటంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటటడంతో ప్రభుత్వం బోర్లపై నిషేధం విధిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

శ్రీకాకుళంలో 76, ప్రకాశంలో 91, పల్నాడులో 20, చిత్తూరులో 8, అనంతపురం జిల్లాలో 14, శ్రీసత్యసాయి జిల్లాలో 39, కడపజిల్లాలో 10 గ్రామాలు కలిపి మొత్తం 258 గ్రామాల్లో నీటి వినియోగం మోతాదుకు మించి ఉన్నట్లు అధికారులు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు.మరోవైపు ఏపీ రైతులకు వ్యవసాయశాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది ముందస్తుగా నీటి విడుదల కారణంగా ముందుగానే, ఇప్పటి నుంచే ఖరీఫ్‌ సన్నద్ధతపై దృష్టి సారించాలన్నారు.

ఈ మేరకు అన్ని జిల్లాల్లో వ్యవసాయ అధికారుల్ని ఆదేశించారు. వ్యవసాయశాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ జిల్లా వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కంటింజెన్సీ ప్లాన్‌తో ఎల్‌నినో ప్రభావం చూపే మెట్ట ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా సిద్ధంగా ఉండాలని సూచించారు.ఈసారి రైతులకు ముందస్తు నీటి విడుదలపై అవగాహన కల్పించాలని సూచించారు. అన్నదాతలు ముందుగానే పంట సాగు చేపడితే.. పంట కోత సమయంలో ప్రకృతి వైపరీత్యాల నుంచి తప్పించుకోవచ్చన్నారు.

ప్రతి రైతు ఫార్మర్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా చూడాలని.. ఏపీ ఎయిమ్స్‌ యాప్‌ను రోజూ గమనించాలని సూచించారు. రైతు రిజిస్ర్టీలో రైతులు అందరిని నమోదు చేయించాలి అన్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లా అధికారులతో సోమశిల, కండలేరు ప్రాజెక్టుల నీటి విడుదలపై మాట్లాడారు. గతేడాది కన్నా ముందుగానే ఈసారి నీటిని విడుదల చేశారని.. వరి నాట్లు ఈనెల 25లోపు పూర్తవుతాయన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు