Homeక్రీడలునేడు కీలక పోరు.. ఓడిపోతే ఇంటికే?

నేడు కీలక పోరు.. ఓడిపోతే ఇంటికే?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ :- ఐపీఎల్ లో భాగంగా ఈరోజు పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ఇప్పటికే ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జేయింట్స్ ఇంటికి వెళ్ళిపోయాయి. ఇక ఈరోజు జరగబోయేటువంటి ఈ కీలకమైన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోతే ఇంటికి వెళ్లాల్సిందే. ధర్మశాల వేదికగా ఈరోజు ఈ ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గెలిస్తే పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానానికి చేరుతుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోతే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకోవాల్సిందే. 11 మ్యాచ్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మిగతా జరగబోయే మూడు మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సి ఉంది. కాగా ఈ ఇరుజట్ల మధ్య బలం బలహీనతలు చూసుకుంటే ఇరుజట్లు కూడా బలంగానే ఉన్నాయి. ఇరుజట్లు ఇప్పటివరకు 36 సార్లు తలపడగా ఢిల్లీ క్యాపిటల్స్ 17 మరోవైపు పంజాబ్ కింగ్స్ 18 మ్యాచ్లు గెలిచాయి. దీంతో ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ పై చాలానే ఉత్కంఠత నెలకొంది. మరి ఈరోజు ఎవరు గెలుస్తారు అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

నెల రోజుల‌కే న‌వ వ‌ధువుల బ‌ల‌వ‌న్మ‌ర‌ణం…అస‌లు ఏం జ‌రిగిందంటే….!</ఏ

ఆకలి బాధలు ఎలా ఉంటాయో తెలుసు.. సీఎం విజయ్ బాగోద్వేగ వ్యాఖ్యలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు