Homeతెలంగాణరానున్న రోజుల్లో తీవ్ర‌మైన ఎండ‌లు....! రేప‌టి నుంచి వ‌డ‌గాల్పులు...

రానున్న రోజుల్లో తీవ్ర‌మైన ఎండ‌లు….! రేప‌టి నుంచి వ‌డ‌గాల్పులు…

  • 47శాతం ఉష్ణోగ్ర‌త‌లు

హైదరాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: రానున్న రోజుల్లో మ‌రింత ఉష్ణోగ్ర‌త‌లు పెర‌గ‌నున్న‌యి. మంగ‌ళ‌వారం నుంచి పెర‌గ‌నున్నాయి. ఈనెల 18 నుంచి 22 ల మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు గ‌రిష్ట స్థాయికి పెరుగుతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. తూర్పు తెలంగాణలో 47 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మిగతా ప్రాంతాల్లో 46 డిగ్రీలకు చేరువగా ఉంటాయని, హైదరాబాద్‌లో సైతం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

పలు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత పెరుగుతుందని, ఇది కనీసం పది రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా, రెండు మూడు రోజులుగా వాతావరణం కొద్దిగా చల్లబడడంతో ఎండల తీవ్రత తగ్గింది. ఆదివారం మళ్లీ స్వల్పంగా పెరిగింది. నిజామాబాద్‌ జిల్లా సాలూర మండల కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మాత్రం 40.2 డిగ్రీల్లోపే రికార్డు అయ్యాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రెండు రోజుల తర్వాత నుంచి క్రమేపీ పెరుగుతాయని, రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

నేడు తేలిక పాటి వ‌ర్షాలు…

సోమవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలో శనివారం అర్ధరాత్రి కురిసిన వడగండ్ల వానతో అన్నదాతలకు నష్టం వాటిల్లింది. అంతేగాకుండా మంచిర్యాల‌, జ‌గిత్యాల‌, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సైతం రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. మొక్కజొన్న, వడ్ల కుప్పలపై టార్పాలిన్లు కప్పకపోవడంతో తడిసిపోయాయి. తడిసిన ధాన్యం,మక్కలను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు