Homeక్రైమ్సినీ ఇండస్ర్టీలో విషాదం...షూటీంగ్‌కు వెళ్తూ రోడ్డు ప్ర‌మాదం...! ఒక‌రు మృతి

సినీ ఇండస్ర్టీలో విషాదం…షూటీంగ్‌కు వెళ్తూ రోడ్డు ప్ర‌మాదం…! ఒక‌రు మృతి

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: ఫౌజీ షూటింగ్‌కు వెళ్తూ ప్ర‌మాదానికి గురైన ఘ‌ట‌న‌లో ఒక‌రు అక్క‌డికక్క‌డే మృతి చెందిన ఘ‌ట‌న సినీ ఇండ‌స్ర్టీలో విషాదం నింపింది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఫౌజీ’ (Fauzi) భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమా షూటింగ్‌కు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురై విషాదం చోటు చేసుకుందని తెలిసింది.

ప్రొడక్షన్‌ యూనిట్‌ సభ్యులు ప్రయాణిస్తున్న కారు అబ్దుల్లాపూర్‌మెట్‌ దగ్గర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

తాజావార్తలు