క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉల్లిగడ్డ పండించేటువంటి రైతన్నల పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి పండించే రైతన్నలు మార్కెట్లో ధరలను చూసి కన్నీరు పెడుతున్నారు. కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వాలకు తమ గోడును వివరించుకుంటూ కన్నీరు పెడుతున్నారు. గత సంవత్సరంలో క్వింటా 1000 నుంచి 1500 రూపాయలు పలికిన ఉల్లి ఇప్పుడు అత్యల్పంగా 400 రూపాయలు మాత్రమే పలకడంతో వీటిని పండిస్తున్న ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది పంట ఎక్కువగా సాగు అయినప్పటికీ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో సప్లై పెరిగి డిమాండ్ అనేది తగ్గింది అని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు రిటైల్‌లో వంద రూపాయలకు 5 నుంచి 8 కేజీల వరకు విక్రయిస్తున్నారు. ఎలాగైనా సరే ప్రభుత్వాలు స్పందించి రైతన్నలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి అని సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Breaking: ఆర్టీసీ సమ్మె ప్రారంభం…బస్సులు బంద్…!
అమెరికా దిగ్బంధానాలు ఉన్నంత కాలం హర్మూజ్‌పై నిషేదం…! బెదిరింపులకు తగ్గేదేలే…ఇరాన్ స్పష్టం…