హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: హైదరాబాద్ నగర్ంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. జీడీమెట్ల పారిశ్రామి ప్రాంతమైన రాంరెడి్డ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్రమంగా నిల్వ ఉంచిన సాల్వెంట్ డ్రమ్స్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వ్యాపించాయి.
మంటల తీవ్రతతో కెమికల్ సాల్వెంట్స్ నిండిన డ్రమ్స్ రోడ్లపై ఎగిసిపడుతూ పేలిపోవడంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ కారణంగా స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
కాగా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డెకరేషన్ సామగ్రి నిల్వ ఉంచిన గోదాములో మంటలు చెలరేగి, పక్కనే ఉన్న ఇంటికి కూడా వ్యాపించాయి. ప్లాస్టిక్ పదార్థాలు ఎక్కువగా ఉండటంతో దట్టమైన పొగ కాలనీలో వ్యాపించింది. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వరుస అగ్ని ప్రమాదాలు…
వేసవి కాలం కావడం అగ్ని ప్రమాదాలు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నాయి. వరుస అగ్ని ప్రమాదాలు సంభవించడం ప్రజలు తీవ్ర అవేదన చెందుతున్నారు. ప్రభుత్వం అధికారులు, అగ్ని మాపక సిబ్బంది అవగాహన కల్పిస్తున్నప్పటి వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవించడంతో ఆస్తినష్టంతో పాటు పరుగులు తీయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అగ్నిప్రమాదాలకు కారణాలను తెలుసుకొని చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
