హైదరాబాద్ క్రైమ్ మిర్రర్: బంగారం కొనుగోలు దారులకు షాక్ ఇచ్చే విధంగా బంగారం ధరలు అమాంతంగా పెరిగాయి.
మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,49,840 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,37,350 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 1,12,380 దగ్గర ట్రేడ్ అయింది. కాగా బుధవారం 24 క్యారెట్లపై 3,980 రూపాయలు.. 22 క్యారెట్లపై 3,650 రూపాయలు.. 18 క్యారెట్లపై 2,990 రూపాయలు పెరిగింది.
హైదరాబాద్‌లో…
హైదరాబాద్‌లో మార్కట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,53,820 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,41,000 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,15,370 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ రోజు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ వెండిపై పది వేలు పెరిగి 2,65,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల వెండిపై వెయ్యి పెరిగి 26,500 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు తరుచుగా మారుతుంటాయి కావున కొనుగోలు దారులు అడిగి కొనుగోలు చేయాలని నిపుణులు పేర్కొంటున్నారు.
