Homeతెలంగాణబిజెపికి ఈటల గుడ్ బై...?!

బిజెపికి ఈటల గుడ్ బై…?!

  • పార్టీ మార్పు పై ఊహాగానాలు

  • కరీంనగర్ లో పెద్ద ఎత్తున పోస్టర్లు

  • ఫుల్ క్లారిటీ ఇచ్చిన రాజేందర్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: ఈటెల రాజేందర్ పార్టీ మారుతారా? బిజెపికి గుడ్ బై చెబుతారా? అలా జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో దీనిపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ సైతం ఆదివారం ఈ ప్రచారంపై స్పందించారు. పార్టీ మార్పు పైపుల్ క్లారిటీ ఇచ్చారు.

ఈటెల రాజేందర్… ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ పేరు తెలియని వారు ఉండరు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన నాటి నుంచి అనుసరించిన నాయకుడు. హుజురాబాద్ కు సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు. టిఆర్ఎస్ లో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే అనుకోని రీతిలో గులాబీ పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. బిజెపిలో చేరాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన రాజేందర్.. సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రి పదవి ఆశించారు. కానీ దక్కలేదు. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించారు. అది కూడా దక్కలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అసంతృప్తితో ఉన్నారని ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఆదివారం స్పందించారు.

ఖండించిన రాజేందర్..
తాను బిజెపికి గుడ్ బై చెబుతానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఈటెల రాజేందర్. కెసిఆర్ నన్ను మెడలు పట్టి బయటకు గెంటేసి ఐదేళ్లు అవుతోంది. ఆరోజు మేము ఏం మాట్లాడినా బయటకు వెళ్లలేని పరిస్థితి. అటువంటి దుస్థితిలోనే నేను బిజెపిలో చేరాను. ఇప్పుడు బిజెపి నుంచి బయటకు వెళ్తున్నారని ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్లో పోస్టర్లు కూడా వేస్తున్నారు. వాటిని మా పార్టీ వారు కూడా షేర్ చేస్తున్నారు. నేను పార్టీ మారే వ్యక్తిని కాదు. బట్టలు మార్చినంత ఈజీగా పార్టీ మారడం సాధ్యం కాదనేది నేను చెప్పే మాట. ఈతల రాజేందర్ ను పోగొట్టుకొని కెసిఆర్ తప్పు చేశారని చర్చ జరుగుతోంది. మళ్లీ తిరిగి వస్తారని కూడా చర్చ నడుస్తోంది. అలాంటి పరిస్థితి రాదని నేను చెబుతున్న అంటూ స్పష్టం చేశారు ఈటెల. ఆరోజు నేను ఎంత బాధ పడ్డానో నాకు తెలుసు. ఆరోజు నన్ను ఇబ్బంది పెట్టడానికి కేసీఆర్ చేయని పని లేదు. నేను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు. సందర్భం వస్తే ఈటెల రాజేందర్ అంటే ఏమిటో తెలుస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్నో రకాల అవకాశాలు..
మరోవైపు తనకు ఎన్నో రకాల అవకాశాలు వచ్చిన విషయాన్ని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. బిజెపిలో ఇతర పార్టీల నుంచి పదవుల కోసం వస్తున్నారు అని పోస్టులు చేస్తున్నారు. అయితే నాడు రాజశేఖర్ రెడ్డి ఏ మంత్రి పదవి కావాలో టిక్ పెట్టుకో అని ఆఫర్ చేశారని గుర్తు చేశారు. తనకు రాజగోపాల్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సహచరులని.. కెసిఆర్ ను ఓడించేందుకు ఒక ఫ్లాట్ఫామ్ మీదకు రావాలని అడిగితే వెళ్లలేదని చెప్పుకొచ్చారు ఈటల రాజేందర్. బిజెపిని వీడే ప్రసక్తి లేదని.. ఆ సందర్భం వస్తే తానే చెబుతానని తేల్చి చెప్పారు రాజేందర్.

ఇవి కూడా చదవండి ….

  1. Telangana: ఆధ్యాత్మిక రాజకీయం…!

  2. Revanth Master Plan: త్రిశూల్ వ్యూహం.. బల్దియా పై రేవంత్ స్పెషల్ గురి!

  3. Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణకు బ్రేక్.. ఆశావహులపై సీఎం రేవంత్ నీళ్లు!

  4. Telangana: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు…!

  5. ఆ మత మార్పిడిల వెనుక జగన్…?!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments