Homeఆంధ్ర ప్రదేశ్ఇక నుండి ప్రభుత్వ బడుల్లో కూడా (LKG, UKG)..!

ఇక నుండి ప్రభుత్వ బడుల్లో కూడా (LKG, UKG)..!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో: ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా చిన్నారులకు చిన్న వయస్సు నుంచే ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన పునాది విద్యను aఅందించాలనే లక్ష్యం తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం (2025-26) నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో UKG (యూకేజీ) తరగతులను ప్రారంభించాలని కీలక నిర్ణయం తీసుకుంది.

అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానం చేస్తూ, ప్రీ-ప్రైమరీ (LKG, UKG) స్థాయి నుంచే పిల్లలను ప్రభుత్వ విద్య వైపు ఆకర్షించడం చెయ్యాలని భావిస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో చేరకముందే పిల్లలకు అక్షర జ్ఞానం మరియు క్రమశిక్షణను అలవాటు చేయడం దీని ఉద్దేశం. దీనివల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు (Enrollments) కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments