HomeతెలంగాణKavitha: తెలంగాణ రాజకీయాల్లో 'కవిత' కలవరం!

Kavitha: తెలంగాణ రాజకీయాల్లో ‘కవిత’ కలవరం!

* జాతీయ పార్టీలుగా కాంగ్రెస్, బిజెపి

* బలవంతపు జాతీయ పార్టీగా భారత రాష్ట్ర సమితి

* తెలంగాణ సెంటిమెంట్ రగిలించే పార్టీగా టిఆర్ఎస్

* పాత పార్టీ పునరుద్ధరణ

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సెంటిమెంట్ ఉన్నంతకాలం కెసిఆర్ కు తిరుగులేకుండా పోయింది. ఎప్పుడైతే తన టిఆర్ఎస్ ను భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారో అప్పటినుంచి కష్టాలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ సెంటిమెంట్ సన్నగిల్లింది. అయితే దానిని ఇప్పుడు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకోవాలని చూస్తున్నారు.  భారతీయ రాష్ట్ర సమితిలో  భయం కలిగిస్తున్నారు. పాత పార్టీ పేరుతో వస్తానని హింట్ ఇస్తున్నారు. టిఆర్ఎస్ పేరుతో కొత్త ప్రాంతీయ పార్టీని ప్రకటిస్తే ఎలా ఉంటుందని చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో కల్పిస్తున్నారు. అయితే ఆమె నిర్ణయం కాంగ్రెస్ బిజెపి లతో పాటు కెసిఆర్, కేటీఆర్లకు సైతం ఒక మాస్టర్ స్ట్రోక్ అవుతుందన్న అంచనాలు మొదలయ్యాయి.

ప్రత్యేక ప్రాంతీయ పార్టీ లేకుండా..

ప్రస్తుతం తెలంగాణలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నడుస్తున్నాయి. జాతీయ పార్టీలుగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. బిజెపి అధికారం కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఎప్పుడైతే కెసిఆర్ తన టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చడంతో రాష్ట్రంలో ప్రత్యేక ప్రాంతీయ పార్టీ అనే ముద్ర పోయింది. అందుకే కేటీఆర్ తమ బిఆర్ఎస్ ను తెలంగాణ పార్టీగా అభివర్ణిస్తుంటారు. అయినా సరే ఆ పార్టీపై తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ కావడం లేదు. ఈ క్రమంలో కవిత మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో రంగంలోకి దిగితే.. అది తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా మారితే అన్ని పార్టీలకు ప్రమాదకరమే. ముఖ్యంగా కెసిఆర్ తో పాటు కేటీఆర్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కవిత ఎమోషనల్ పాలిటిక్స్ కు పెట్టింది పేరు. తెలంగాణ జాగృతి పేరుతో బలమైన నెట్వర్క్ ఆమె ఏర్పాటు చేసుకున్నారు. దానికి టిఆర్ఎస్ బలం తోడు అయితే కవిత బలంగా నిలబడటం ఖాయం.

భారత రాష్ట్ర సమితికి తీరని నష్టం..

మూలిగే నక్క పై తాటి పండు పడ్డ చందంగా ఉంది భారతీయ రాష్ట్ర సమితి పరిస్థితి. ఒకవేళ కవిత సొంతంగా టిఆర్ఎస్ పార్టీ పెడితే తన తండ్రి పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం. పార్టీ క్యాడర్ సైతం రెండుగా చీలిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం కెసిఆర్ గొడుగు కింద ఉన్న పాత టిఆర్ఎస్ నేతలు అందరూ అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. దీంతో వారంతా కవితను వెతుక్కుంటూ వస్తే గులాబీ పార్టీ విలవిలలాడడం ఖాయం. కేవలం జాతీయ రాజకీయాల కోసమే కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీని పణంగా పెట్టారు. అదే పార్టీని కవిత పునరుద్ధరిస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే కవిత ముందుగా తన తండ్రి పార్టీని చీల్చినట్టు అవుతారు. కేటీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకించే వర్గానికి కవిత ఒక ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తారు.

మంచి వ్యూహకర్త సైతం..

కవిత కేవలం కేసీఆర్ కుమార్తె మాత్రమే కాదు. ఆయనకు మించి రాజకీయ వ్యూహాలు రూపొందించగలరు అని పేరును సైతం సంపాదించుకున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు వంటి క్లిష్ట పరిస్థితులను బయటపడిన తర్వాత ఆమె ఎంచుకున్న రాజకీయ మార్గం చూస్తే మాత్రం ఆమె వ్యూహం ఇస్తే అర్థమైపోతుంది. తన తండ్రికి కెసిఆర్ పెట్టిన పార్టీని.. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకే మళ్లీ టిఆర్ఎస్ ను తెచ్చాను అనే ఎమోషనల్ కార్డును తెరపైకి ఇప్పిస్తే తెలంగాణ ఓటర్లు అటువైపు యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్, బిజెపిలు ఢిల్లీ వేదికగా పనిచేస్తున్నాయి. ఇటువంటి సమయంలో తెలంగాణ గొంతుకగా కవిత పార్టీ మారితే మాత్రం ఎనలేని ఆదరణ దక్కే అవకాశం ఉంది. ఇది అంతిమంగా భారతీయ రాష్ట్ర సమితికి పెనుగండంగా మారనుంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments