Homeతెలంగాణప్రజా స్వామ్యం గెలిచింది...రాబోయేది ఇక గులాబి పార్టీనే...!

ప్రజా స్వామ్యం గెలిచింది…రాబోయేది ఇక గులాబి పార్టీనే…!

  • ప్ర‌జ‌లు మ‌ళ్లీ సీఎంగా కేసీఆర్‌నే కోరుకుంటున్న‌రు

  • ఈ గెలుపు యావ‌త్ తెలంగాణ‌దే…

  • తాటాకు చ‌ప్పుళ్ల‌కు బ‌య‌ప‌డేది బీఆర్ ఎస్ కాదు

  • ప్ర‌జ‌లు కాంగ్రెస్ పాల‌న‌ను గ‌మ‌నిస్తున్న‌రు

  • మాజీ ఎమ్మెల్య బాల్క సుమ‌న్‌

 

మంచిర్యాల, క్రైమ్ మిర్ర‌ర్: రాష్ట్రంలో ప్రజాస్వామం గెలిచిందనడానికి క్యాతన్‌ప‌ల్లి మున్సిప‌ల్ ఎన్నికలే నిదర్శనమని మంచిర్యాల జిల్లా బీఆర్ ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. రాష్ర్టంలో రాబోయేది ఇక బీఆర్ ఎస్ పార్టీయేన‌ని అన్నారు. శ‌నివారం రామకృష్ణాపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ ఎస్, సీపీఐ అభ్యర్థులను ప్రజలు ఎన్నుకున్నప్పటికీ మంత్రి వివేక్ అనేక ప్రలోబాలకు గురి చేసి అభ్యర్థులను ఇబ్బందుల పాలు గురి చేసి బీఆర్ ఎస్ నాయకుల పై, తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన చివరికి ప్రజా తీర్పు ముందు ఇవ్వన్ని పటాపంచలయ్యాయని అన్నారు.

ప్రజలు శనివారం హైకోర్టు తీర్పును అనుసరించి క్యాత‌న్‌ప‌ల్లి మున్సిపాలిటిలో చైర్మన్ గా గొడిశెల సంద్వరాణి. వైస్ చైర్మన్ మిట్టపల్లి సరితలు ఏకగ్రీవంగా ఎంపిక కావడం యావత్ తెలంగాణ బీఆర్ ఎస్ గెలుపుగా స్వీకరిస్తున్నామన్నారు. ఉద్యమాలు చేపట్టి రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం జైళ్లకు వెళ్లిన‌ బీఆర్ ఎస్ నాయకులను, కార్యకర్తలను అక్రమ అరెస్టులకు పాల్పడితే భ‌య‌ప‌డుతార‌నుకోవ‌డం మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి |భ్ర‌మ అని అన్నారు.. తాటాకు చప్పులకు బయపడే పార్టీ బీఆర్ఎస్ కాదని ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చి పేద ప్రజలపై జీవితాలతో రాష్ట్రంలో ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ పాలన చేతకాక సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు.

కోరం ఉన్న ఇబ్బందులు గురి చేయ‌డం స‌రికాదు…

పూర్తి స్థాయి కోరం ఉన్నప్పటికీ క్యాతనపల్లి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం మంత్రి వివేక్ పోలీసులను, అదికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజా వ్యతిరేక పాలన చేయడం సరికాదన్నారు. 22 వార్డులకు గాను 14వ వార్డులుపూర్తిగా సీపీఐ, బీఆర్ ఎస్ నాయకులు గెలుచుకున్నప్పటికీ ఎంపిక సజావుగా సాగుతున్న క్రమంలో బీఆర్ ఎస్ నాయకులపై రాళు్ల‌ రువ్వి అక్రమ అరెస్టులు చేసి జైలుకు పంపి పీఠాన్ని కైవసం చేసుకోవాలనుకోవడం నీతిమాలిన చర్య అని మండిపడ్డారు.

ఇప్పటికే రాష్ట్రం అదోగతికి చేరుకుందని ప్రజలంతా కేసీఆర్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని క్యాబినేట్ మీటింగ్లంటూ ముఖ్యమంత్రి పాలన చాతకాక మేడారం, ఇతర ప్రాంతాల్లో సమావేశాలు పెడుతూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఏ ముఖ్యమంత్రి కూడ అనుసరించనటువంటి ప్రజా వ్యతిరేక విదానాలను సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినేట్ మంత్రులు అనుసరిస్తున్నారన్నారు. ప్రజలు గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో ప్రజా తీర్పు ముందు రేవంత్ రెడ్డి కొట్టుకపోవడం ఖాయమన్నారు.

హ‌డ్రా పేరుతో పేద‌ల ఇండ్ల‌ను కూల్చ‌డం స‌రికాదు…

పేద ప్రజల ఇండ్లను టార్గెట్ స్తూ హైదరాబాద్, ఖమ్మంలో హైడ్రోపేరిట అక్రమ కూలగొట్టడాలు అడ్డువచ్చిన నాయకులను అరెస్టు చేయడాలు, ప్రశ్నించిన మీడియాపై నిషేధాలు వేస్తూ పాలిస్తున్న రేవంత్ రెడ్డికి రోజులు దగ్గరపడ్డాయని ప్రజలను అయోమయానికి గురి చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి అదే ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయ‌ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ ల‌క్ష్మి అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసిఆర్ పాలనే బాగుందంటూ రాష్ట్ర వ్యాప్తంగా నినాచాలు చేస్తున్నారని కాంగ్రెస్ కేబినేట్ మంత్రులు పక్కా ఊరికి వెళ్లాలన్న ప్రభుత్వ నిదులను దుర్వినియోగం చేస్తూ హెలీక్యాప్టర్లో చక్కరు కొట్టడానికి నిదులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ ప్రశ్నించారు.

ఏఐటీయుసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ కార్యవర్గ సభ్యులు కలవేణి శంకర్లు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడిన ఏఐటియుసీ, సీపీఐ నాయకులపై మంత్రి వివేక్ చౌకబారు ప్రకటనలు చేయడం సరికాదని సీపీఐ నమ్మిన సిద్ధాంతాల కోసమే పని చేస్తుందని క్యాతన్‌ప‌ల్లిలో బీఆర్ఎస్తో కలిసి పని చేయడం వల్లనే కాంగ్రెస్ వైఖరి ఇటు రాష్ట్రంలో జిల్లాలో పూర్తిగా తేటతెల్లమైందన్నారు. ఎం. పికైన చైర్మన్, వైస్ చైర్మన్ ల‌కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు .

ఈ కార్యక్రమంలో మం చిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, కరీంనగర్ మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, జడ్పి మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఎఐటియుసి, సీపీఐ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments