Homeక్రీడలు15 ఏళ్ల భారత కుర్రాడి ఆటకు బట్లర్ ఫిదా!

15 ఏళ్ల భారత కుర్రాడి ఆటకు బట్లర్ ఫిదా!

క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్:- భారత్ క్రికెట్ చరిత్రలో అద్భుతం సృష్టిస్తున్న యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ప్రతి ఒక్కరి దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాడు. ఇప్పటికే ప్రారంభమైన ఐపిఎల్ సీజన్ 19 లో మొదటి మ్యాచ్ లోనే అతి తక్కువ బంతుల్లో అద్భుతమైన బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 15 సంవత్సరాలకే క్రికెట్లో ఇంతటి విధ్వంసం సృష్టించడం బహుశా ఇదే తొలిసారి. ఈ యంగ్ సెన్సేషన్ వైభవ్ బ్యాటింగ్ అద్భుతం అంటూ తాజాగా ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జోష్ బట్లర్ ప్రశంసలతో ముంచెత్తారు. నా క్రికెట్ చరిత్రలో నేను చూసిన అత్యుత్తమ యువ క్రికెటర్ నువ్వే అంటూ బట్లర్ ప్రశంసించాడు. అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా వైభవ్ ఇంగ్లాండ్ జట్టుపై చేసిన సెంచరీని బట్లర్ గుర్తుచేసి మా దేశ క్రికెట్ అభిమానుల హార్ట్ ను బ్రేక్ చేశావు అని సరదాగా వ్యాఖ్యానించారు. కాగా ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు GT మరియు రాజస్థాన్ మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగునుంది. ఈ నేపథ్యంలోనే జోష్ బట్లర్ ఈ 15 సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ ఆట తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపించారు.

ఫుడ్ సేఫ్టీ రైడ్స్ లో ఐస్ క్రీమ్ కల్తీలు.. పలు గ్రామాల్లో బండ్లు నిషేధం!

తిరుప‌తిలో దారుణం… ఒంట‌రిగా ఉన్న మ‌హిళ‌పై ఇంటి య‌జ‌మాని…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments