Homeతెలంగాణనేటి నుండి మూడు రోజులు భారీ వర్షాలు..!

నేటి నుండి మూడు రోజులు భారీ వర్షాలు..!

  • నేటి నుండి మూడు రోజులు భారీ వర్షాలు..!

  • పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..

  • గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు..

  • చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదు

  • వాతావరణ శాఖ అధికారులు సూచనా..

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

నేటి నుండి వరుసగా మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగవచ్చు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ cహేశారు అధికారులు. గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు అని తెలిపారు. ముఖ్యంగా ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, సాయంత్రం వేళల్లో చిరుజల్లులు పడవచ్చు అని తెలిపింది.

కావున వర్షం పడే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదని అధికారులు ప్రజలను కోరుతున్నారు. రైతులు తమ ధాన్యం మరియు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు