ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మరణించి ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని మయామిలో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇవిషియేటివ్ ప్రయారిటి సమ్మిట్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనికులు ఇరాన్ అగ్రనాయకత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించాయి. ఇరాన్ సైనిక వ్యవస్థను నిర్మూలించడంలో అమెరికా సైనికులు శక్తికి మించి పోరాడారని తెలిపారు. అమెరికా సైనిక చర్యల వల్ల ఇరాన్ పూర్తిగా బలహీనపడిందని పేర్కొన్నారు.
ఇరాన్ అన్నివిధాలుగా నాశనమైంది…
‘ఇరాన్ నౌకాదళం అంతమైపోయింది. అదంతా అఖాతపు అడుగున మునిగిపోయింది.. వారి వైమానిక దళం పూర్తిగా, సమూలంగా నాశనమైంది. వారి విమాన నిరోధక, సమాచార ప్రసార సామర్థ్యాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. అంతేకాదు, ఇరాన్ నాయకత్వం, సైనిక శక్తి కూడా నాశనమైంది. వారి నాయకులందరూ చనిపోయారు.. వారి సుప్రీం లీడర్ ఇక సర్వోన్నతుడు కాదు. ఆయన మరణించారు.’ అని ట్రంప్ అన్నారు. ఇరాన్ ఆయుధ నిల్వలను తాము చిన్నాభిన్నం చేస్తున్నామని, ఎవరూ ఊహించని స్థాయిలో వారి క్షిపణి, డ్రోన్ కర్మాగారాలను ధ్వంసం చేస్తున్నామని ట్రంప్ తెలిపారు. వారి రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని తుడిచిపెట్టేశామని ట్రంప్ చెప్పుకొచ్చారు.
కాగాట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ప్రభుత్వం ఎటువంటి అధికారంగాధృవీకరించలేదు. సాధారణంగా ఇరాన్ గొప్ప నాయకుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతుంది. అయతుల్లా ఖమేని మరణం తర్వాత కుమారుడు మొజ్తబా ఖమేని బాధ్యతలు చేపట్టినట్టుగా వార్తలు వచ్చాయి.గతంలో కూడా అలీ ఖమేనీ ఆరోగ్యంపై అనేక పుకార్లు వచ్చినప్పుడు ఇరాన్ నిశ్శబ్దంగానే ఉంది.
