Homeతెలంగాణభద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు LIVE..!

భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు LIVE..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు చాలా కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ రోజు (మార్చి 26) సాయంత్రం జరిగే ‘ఎదుర్కోలు’ ఉత్సవం సీతారాముల కల్యాణానికి ముందు జరిగే అత్యంత కీలకమైన ఘట్టం.

ఈ వేడుకలో పెళ్ళి కుమారుడి తరపు వారు, పెళ్ళి కుమార్తె తరపు వారు పరస్పరం వంశాభివర్ణన చేసుకుంటూ సాగే సంవాదం భక్తులను విశేషంగా అలరిస్తుంది. రేపు (మార్చి 27) మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి, ఆపై మార్చి 28న జరిగే మహా పట్టాభిషేకానికి భద్రాద్రి క్షేత్రం సర్వసన్నద్ధమైంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు