Thursday, March 26, 2026
Homeతెలంగాణసూర్యాపేట - వనపర్తి ప్రాంతాల మీదుగా కొత్త రైల్వే లైన్ పూర్తి..!

సూర్యాపేట – వనపర్తి ప్రాంతాల మీదుగా కొత్త రైల్వే లైన్ పూర్తి..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: మార్చి 25, 2026న లోక్‌సభలో ఎంపీ మల్లు రవి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలంగాణలో డోర్నకల్ – గద్వాల మధ్య ప్రతిపాదించిన కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సర్వే పూర్తయిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ కొత్త రైల్వే లైన్ సుమారు 296 కిలోమీటర్ల మేర నిర్మించబడుతుంది.

ఈ లైన్ సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి ప్రాంతాల మీదుగా సాగుతుంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారీ తర్వాత, తెలంగాణ ప్రభుత్వంతో పాటు నీతి ఆయోగ్, ఆర్థిక శాఖల సంప్రదింపుల అనంతరం తుది అనుమతులు మంజూరు చేస్తారు. దీంతో పాటు జడ్చర్ల – నంద్యాల మధ్య 182 కిలోమీటర్ల మేర కొత్త లైన్ నిర్మాణం కోసం కూడా సర్వే పూర్తయిందని మంత్రి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments