Homeతెలంగాణఘనంగా ఎంపీ రఘునందన్ రావు జన్మదిన వేడుకలు...!

ఘనంగా ఎంపీ రఘునందన్ రావు జన్మదిన వేడుకలు…!

క్రైమ్ మిర్రర్,గచ్చిబౌలి: బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం హైదరాబాద్ గచ్చిబౌలి లోని తన నివాసంలో మిత్రులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు జన్మదిన శుభాకాంశాలు తెలిపి ఎంతో ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.

సందర్బంగా సంగారెడ్డి జిల్లా బిజెపి మహిళా మోర్చా మరియు దిశ కమిటీ సభ్యులు కే.సుజాత మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ప్రజా సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుండి అందరికీ అందేల కృషి చేస్తూ, అందరికీ అండగా నిలుస్తూ మరియు ప్రజా శ్రేయస్సు కోసం అనునిత్యం తపన పడే ఒక మంచి నాయకుడని కొనియాడారు.

ఆయన అమూల్యమైన సేవలు వర్ణనాతీతం ఇలాంటి గొప్పా మనసున్న నాయకులు మన ఆత్మ బంధువుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు. అనంతరం పటాన్ చేరు 113వ డివిజన్ గౌతం నగర్ భూత్ అధ్యక్షులు చిట్ల కుందన్ ముదిరాజ్, పెన్సిల్ ఆర్టిస్ట్ చిట్ల కార్తీక్ ముదిరాజ్, శిరీష, వెంకట్ మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు