Homeతెలంగాణసీఎం కావాల‌ని ఉంది....! మ‌ల్లారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు...

సీఎం కావాల‌ని ఉంది….! మ‌ల్లారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు…

  • రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌….

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి ఏది మాట్లాడిన సంచ‌ల‌న‌మే అని చెప్ప‌వ‌చ్చు. తెలంగాణ అసెంబ్లీలో లాభాల్లో ఆయ‌న మాట్లాడిన మాట‌లు హాట్ టాపిక్‌గా మారాయి. కాగా సీఎం రేవంత్ రెడ్డితో త‌న‌కు ఉన్న సంబంధం గురించి సినిమాల్లో త‌న న‌ట‌నాభిలాష గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ రోజు అసెంబ్లీలో విలేక‌రుల‌తో చిట్‌చాట్ చేస్తూ మ‌ల్లా రెడ్డిన త‌న అభిప్రాయాలు, అభిరుచుల‌ను వెల్ల‌డించారు.

రెడ్డి సామాజిక వ‌ర్గంలో రేవంత్‌ను మించిన నాయ‌కుడు లేడు…

సీఎం రేవంత్ రెడ్డి గురించి మ‌ల్లారెడ్డి చేసిన వ్యాఖ్య‌లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్‌రెడ్డిని మించిన మ‌రో నాయ‌కుడు లేడ‌ని నేను గ‌తంలో చెప్పాన‌ని తెలిపారు. రాజకీయాలు ఎలా ఉన్నా.. ఎవరు అవునన్నా, కాదన్నా తాను, రేవంత్‌రెడ్డి అన్నదమ్ములమే’ అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

విల‌న్ పాత్ర‌కు నో చెప్పాను…

ప‌ట‌ప‌. సినిమాలపై తనకున్న మక్కువను మల్లారెడ్డి మరోసారి బయటపెట్టారు. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా ఇటీవ‌ల విడుద‌లైన విష‌యం తెలిసేందే. కాగా ఈ సినిమాలో విల‌న్ పాత్ర చేయ‌మ‌ని ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ త‌నను అడిగార‌ని పేర్కొన్నారు. విల‌న్‌పాత్ర‌కు నో చెప్పిన‌ట్లు తెలిపారు.

రియ‌ల్ గా కాకున్న రీల్‌లైఫ్‌లో సీఎం కావాల‌ని ఉంది…

రియల్ లైఫ్‌లో కాకపోయినా, రీల్ లైఫ్ లోనైనా’ ముఖ్యమంత్రి కావాలని ఉందంటూ మల్లారెడ్డి తన మనసులో మాటను చెప్పారు. సినిమాల్లో తనకు ముఖ్యమంత్రి పాత్ర చేయాలని బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

 

 

తాజావార్తలు