గండిపేట,క్రైమ్ మిర్రర్:- రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు ఎన్నికల హామీలను అమలు చేయాలి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పంతంగి రాజ్‌భూపాల్‌గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎన్నికల హామీలను అమలు చేయాలని, జిల్లాలోని ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు పార్టీ నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సంందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలన్నారు. వృద్ధాప్య వితంతు, దివ్యాంగులు, ఒంటరి మహళల పెన్షన్ ధరఖాస్తులను వెంటనే ఆమోదించి వారికి ఆర్థిక భరోసా కల్పించాలన్నారు.
అర్హులైన పేదలకు గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లను మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు సమర్పించిన ధరఖాస్తులను తక్షణమే పరిష్కరించి న్యాయం చేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణ, వీధిదీపాలు, ఇతర కనీస సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నివాస, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల జారీలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నివారించాలన్నారు. ప్రభుత్వం స్పందించి మండల పరిధిలోని ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అంజన్ కుమార్ గౌడ్, బొక్క నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్ కె. ఎస్. రత్నం, విష్ణువర్ధన్ రెడ్డి, మహేశ్వరం కంటెస్టెంట్ ఎమ్మెల్యే అందెల శ్రీరాములు యాదవ్, వై శ్రీధర్,మల్లారెడ్డి, మల్లేష్ యాదవ్, నారాయణ యాదవ్, విజయ్ కుమార్, ఐటీ సెల్ రంగారెడ్డి ఇంచార్జ్ చేడం వెంకటరమణ గుప్తా, కొమరయ్య, పెంటయ్య, శేఖర్ గౌడ్, బొక్క బాల్ రెడ్డి, జోగి రవి,సులిగే వెంకటేష్, సందీప్ ముదిరాజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
