Homeసినిమా‘ధురంధర్-2 పరమ చెత్త సినిమా’.. హీరోయిన్ షాకింగ్ రివ్యూ

‘ధురంధర్-2 పరమ చెత్త సినిమా’.. హీరోయిన్ షాకింగ్ రివ్యూ

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమాతో వచ్చిన సంచలన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా భారీ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొత్త రికార్డులు సృష్టించింది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా సక్సెస్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ అంచనాల నడుమ సీక్వెల్‌గా వచ్చిన ధురంధర్ ది రివెంజ్ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి స్పందన తెచ్చుకుంటోంది. తొలి రోజే దేశవ్యాప్తంగా రూ.103 కోట్ల వసూళ్లు సాధించిందనే వార్తలు వినిపిస్తుండగా, ప్రత్యేక ప్రదర్శనలతో కలిపి మొత్తం కలెక్షన్లు సుమారు రూ.172 కోట్లకు చేరినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ లెక్కలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే, ఈ సినిమాపై కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్‌లో సినిమా పూర్తిగా నిరాశపరిచిందని, థియేటర్‌లో చూసి సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని వ్యాఖ్యానించారు. “సినిమా చూస్తూ థియేటర్‌లోనే నిద్రపోయాను, ఇది ఓటీటీలో చూసే స్థాయి సినిమా మాత్రమే” అంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

అంతేకాకుండా మొదటి భాగం ఫర్వాలేదని, కానీ సీక్వెల్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంటూ, “రణవీర్ ఇంకా బాగా చేయగలడు” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకవైపు భారీ వసూళ్లతో సినిమా దూసుకెళ్తుండగా, మరోవైపు నెగటివ్ రివ్యూలు కూడా చర్చకు దారి తీస్తుండటం గమనార్హం.

ALSO READ: నో స్టాక్.. నగరంలో ఒక్కొక్కటిగా మూతబడుతున్న పెట్రోల్ బంక్‌లు!

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు