Homeతెలంగాణఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించాలి : మున్సిపల్ కమిషనర్

ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించాలి : మున్సిపల్ కమిషనర్

రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:-క్యాతనపల్లి పురపాలక సంఘానికి ఇటీవల జరిగిన రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసిన అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు వివరాలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, హైదరాబాద్ ఆదేశాల మేరకు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తేదీ (13 ఫిబ్రవరి 2026) నుంచి 45 రోజులలోపు అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు వివరాలను అందజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో అభ్యర్థులందరూ నిర్ణీత ఫారంలో ఎన్నికల ఖర్చు వివరాలను ఈ నెల 27వ తేదీ లోపు క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.ఎన్నికల ఖర్చు నమోదు కోసం అవసరమైన ఫారమ్‌లు మున్సిపల్ కార్యాలయంలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నిర్ణీత గడువులోగా వివరాలు సమర్పించని పక్షంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.మరిన్ని వివరాల కోసం పనివేళల్లో పురపాలక సంఘ కార్యాలయాన్ని సంప్రదించాలని కమిషనర్ మారుతి ప్రసాద్ సూచించారు.

Politics: ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డికి ఎదురుపడ్డ మాజీ మంత్రి రోజా

అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారట!.. ఎక్కడో తెలుసా?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు