క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- గుజరాత్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుర్తు తెలియని దుండగులు అసెంబ్లీ భవనాన్ని లేపేస్తాము అంటూ బాంబు బెదిరింపు ఈమెయిల్ పంపినట్లుగా సమాచారం. ఈ విషయం తెలియగానే బడ్జెట్ సమావేశాలలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మరియు కొంతమంది సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. బయటకు చేరుకున్న వెంటనే బాంబ్ స్క్వాడ్ కు సమాచారం అందించగా వెంటనే వారు అక్కడికి చేరుకొని అసెంబ్లీ మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం మొదలుపెట్టారు. గత ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 25వ తేదీన ముగియనున్నాయి. మరో వారం రోజులలో ఈ బడ్జెట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకొని ఈ విషయంపై పూర్తిగా విచారణ చేపట్టారు.
10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్.! గులాబీ పార్టీకి షాక్
