హైదరాబాద్, క్రైమ్ మిర్రర్:దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. గురువారంతో పోలిస్తే శుక్రవారం నాడు మార్కెట్లలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఇంకాస్త దిగొచ్చాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో బంగారం, వెండి రేట్లను పరిశీలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధరపై రూ.980 పతనమై రూ.1,61,240కు చేరింది.
కాగా 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.900 తగ్గి రూ.1,47,800 వద్ద ట్రేడవుతోంది.ఇక వెండి విషయానికొస్తే క్రితం రోజుతో పోలిస్తే కిలో వెండిపై రూ.100 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,79,900గా ఉంది. అయితే గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడమే ధరల తగ్గుదలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
