Homeక్రైమ్రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు డ్రైవ‌ర్ల మృతి

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు డ్రైవ‌ర్ల మృతి

నల్గొండ, క్రైమ్ మిర్ర‌ర్: నార్క‌ట్‌ప‌ల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున రెండు లారీ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు అక్క‌డిక్క‌డే మరణించారు. హైదరాబాద్ నుండీ ఆంధ్ర వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది. నిలిపి ఉన్న లారీని మరో లారీ వేగంగా ఢీకొట్టడంతో క్యాబిన్ మధ్య ఇరుక్కున్న ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. మృతులు శ్రీ‌నివాస్‌, బంగార‌య్య‌గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజావార్తలు