Tuesday, March 10, 2026
Homeఆంధ్ర ప్రదేశ్AP Politics: దువ్వాడ ఇన్.. ధర్మాన బ్రదర్స్ అవుట్!?

AP Politics: దువ్వాడ ఇన్.. ధర్మాన బ్రదర్స్ అవుట్!?

* ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ ఎత్తివేత

* తిరిగి పార్టీలోకి ఆహ్వానించే పనిలో జగన్

* అదే జరిగితే బలమైన కుటుంబం బయటకు?

క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం: రాజకీయాల్లో కులాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కుల సమీకరణలు లేనిదే రాజకీయం లేదు. అంతలా మారిపోయింది పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాలో అయితే ప్రధానంగా ఓ మూడు కులాలు మధ్య రాజకీయం నడుస్తూ ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ మూడు కులాలు ఉంటాయి. కానీ గత నాలుగు దశాబ్దాల కాలంగా ఒక సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం లభిస్తోంది. దీంతో మరో రెండు కులాలు ఆగ్రహంగా ఉన్నాయి. తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.

జిల్లాలో పెద్దదిక్కు..

ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు ధర్మాన బ్రదర్స్. దశాబ్దాలుగా ఆ కుటుంబం రాజకీయం చేస్తూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆ కుటుంబం తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ గూటికి చేరింది. అయితే అధికారంలో ఉన్నా.. లేకపోయినా ధర్మాన ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. పార్టీ గెలిస్తే మంత్రులు అవుతారు. ఓడిపోతే పార్టీ బాధ్యతలు తీసుకుంటారు. ఇలా ధర్మాన ఫ్యామిలీ పలుకుబడి బాగానే ఉంది శ్రీకాకుళం జిల్లాలో. అదే సమయంలో కింజరాపు కుటుంబంతో లోపాయికారి ఒప్పందాలతో ధర్మాన కుటుంబం ముందుకు సాగుతోంది అన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఫార్ములా తోనే ఆ రెండు కుటుంబాలు కలిసి కాలింగ సామాజిక వర్గాన్ని అణగదొక్కుతున్నాయన్న ఆరోపణ ఎప్పటినుంచో వినిపిస్తోంది. దీనిని బాహటంగానే బయటపెట్టారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్.

తెరపైకి కాళింగ సామాజిక వర్గం..

ధర్మాన కుటుంబం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కాళింగ సామాజిక వర్గం అభ్యంతరం తెలుపుతున్నట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం కాలింగ సామాజిక వర్గంతో సర్దుబాటు చేసుకునే పనిలో ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. ఇటీవల మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం రాజకీయ దూకుడు పెంచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు. మరోవైపు సస్పెన్షన్ వేటుపడిన దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల అసెంబ్లీ ప్రాంగణంలో జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. జగన్ దువ్వాడ వైఖరి పట్ల సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ పై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేసి పార్టీలోకి తీసుకుంటారన్న ప్రచారం తెగ జరుగుతోంది. దీంతో ధర్మాన బ్రదర్స్ పునరాలోచనలో పడినట్లు ప్రచారం నడుస్తోంది.

దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు..

ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ ధర్మాన సోదరులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కింజరాపు కుటుంబంతో కలిసి తనను ఓడించారని సంచలన ఆరోపణలు చేశారు. వారిని కేడి బ్రదర్స్ గా అభివర్ణించారు. అటువంటి దువ్వాడ శ్రీనివాసును చేరదీస్తే మాత్రం ధర్మాన బ్రదర్స్ కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. అయితే ధర్మాన బ్రదర్స్ లేని వైసిపి రాజకీయం శ్రీకాకుళం జిల్లాలో లేదు. అలాగని కింజరాపు కుటుంబంతో ధర్మాన కుటుంబం రాజీ పడుతోందన్న విమర్శలు ఉన్నాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. దువ్వాడను పార్టీలోకి తీసుకున్న మరుక్షణం ధర్మాన బ్రదర్స్ బయటకు వెళ్లిపోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments