Saturday, March 7, 2026
Homeతెలంగాణన్యాయమే ఊపిరి - జనహితమే లక్ష్యం..

న్యాయమే ఊపిరి – జనహితమే లక్ష్యం..

  • *న్యాయమే ఊపిరి – జనహితమే లక్ష్యం..*
  • *–రాపోలు భాస్కర్ సామాజిక ప్రస్థానం*
  • *రాజకీయ అనుభవం నుండి న్యాయ పోరాటం వరకు*
  • *అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం – విద్యా విశిష్టత*
  • *మానవ హక్కుల పరిరక్షణ – బాధితుల పక్షాన పోరాటం*
  • *తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(క్రైమ్ మిర్రర్)*

​న్యాయం కేవలం కోర్టు గదులకే పరిమితం కాకూడదని, అది సామాన్యుడి గడప వరకు చేరాలని నమ్మే అరుదైన వ్యక్తులలో రాపోలు భాస్కర్ ఒకరు. తెలంగాణ హైకోర్టులో ప్రముఖ న్యాయవాదిగా, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న, ఆయన ప్రస్థానం నేటి తరానికి ఒక స్ఫూర్తిదాయకం. కేవలం చట్టం చదువుకున్న మేధావిగానే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల కష్టనష్టాలు తెలిసిన నాయకుడిగా, ఆయన గొంతుక న్యాయస్థానాల్లో బలంగా వినిపిస్తోంది.

*​అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత న్యాయస్థానం వరకు..*

న్యాయవాది ​రాపోలు భాస్కర్ నేపథ్యం అత్యంత ఆసక్తికరమైనది. ఆయన ప్రస్థానం అట్టడుగు రాజకీయాల నుంచి ప్రారంభమైంది. రెండు పర్యాయాలు వేములపల్లి మండల పరిషత్ అధ్యక్షుడిగా, బాధ్యతలు నిర్వహించిన ఆయన, స్థానిక పరిపాలనపై తిరుగులేని పట్టు సాధించారు.


ఒక ప్రజా ప్రతినిధిగా గ్రామీణ ప్రజల సమస్యలను, ప్రభుత్వ యంత్రాంగంలోని లోపాలను అత్యంత దగ్గరగా పరిశీలించారు. అధికార పదవుల కంటే, చట్టబద్ధమైన పోరాటమే సమాజంలో శాశ్వత మార్పు తీసుకువస్తుందని నమ్మి, ఆయన పూర్తిస్థాయిలో న్యాయవాద వృత్తికి అంకితమయ్యారు.

*​అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యం*

ఆయన కేవలం ​సాధారణ న్యాయవాదిగా మిగిలిపోకుండా, నిరంతరం నేర్చుకోవాలనే తపన ఆయనను అంతర్జాతీయ స్థాయికి చేర్చింది. సింగపూర్, బ్యాంకాక్ వంటి దేశాల్లో ఆర్బిట్రేషన్ మరియు మధ్యవర్తిత్వంలో ఆయన ప్రత్యేక శిక్షణ పొందారు. వివాదాలను కేవలం కోర్టుల ద్వారానే కాకుండా, సామరస్యంగా ఎలా పరిష్కరించవచ్చో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనే చెప్పుకోవాలి.

ప్రతిష్టాత్మకమైన నల్సార్ యూనివర్సిటీ నుండి, ఫ్యామిలీ డిస్ప్యూట్ రిజల్యూషన్‌లో, మరియు ఢిల్లీలో మానవ హక్కుల విభాగంలో అదనపు అర్హతలు సాధించి, చట్టంపై తనకున్న పట్టును నిరూపించుకున్నారు.

*​సామాజిక చైతన్యమే ఊపిరిగా*

​రాపోలు భాస్కర్ కేవలం ఫీజు తీసుకుని వాదించే న్యాయవాది కాదని, ఆయన ఒక సామాజిక కార్యకర్తని,
​ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, సమాజానికి హాని కలిగించే అంశాలపై, పౌర హక్కుల భంగంపై, ఆయన హైకోర్టులో ఎన్నో కీలకమైన కేసులు దాఖలు చేసి, బాధితుల పక్షాన నిలిచారు.

చట్టం పట్ల సామాన్యులకు అవగాహన లేకపోవడమే, అతిపెద్ద సమస్య అని భావించి, గ్రామీణ స్థాయిలో ‘లీగల్ అవేర్‌నెస్’ కార్యక్రమాల ద్వారా, ఎంతో మందిని చైతన్యవంతులను చేస్తున్నారు. రాపోలు భాస్కర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను, న్యాయం, సామాజిక సేవా రంగాలలో సంపాదించుకున్నారు.

చట్టం అనేది బలవంతుల ఆయుధం కాకూడదని, అది బలహీనులకు రక్షణ కవచం కావాలని, ఇదే రాపోలు భాస్కర్ నినాదమంటారు అనుభవిజ్ఞులు.

​ఒకవైపు సివిల్ వివాదాలను పరిష్కరిస్తూనే, మరోవైపు మానవ హక్కుల పరిరక్షణ కోసం అలుపెరగని, పోరాటం చేస్తున్న ఆయన వ్యక్తిత్వం నిజంగా అభినందనీయమనే చెప్పుకోవాలి. న్యాయవ్యవస్థపై సామాన్యుడికి నమ్మకం కలిగించే, ఇలాంటి వ్యక్తులు మన సమాజానికి ఎంతో అవసరం.

*మానవ హక్కుల పరిరక్షణ*

​ఢిల్లీలో మానవ హక్కుల విభాగంలో ఆయన పొందిన ప్రత్యేక అర్హత, ఆయన వాదనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. పోలీస్ కస్టడీలో వేధింపులు, అక్రమ అరెస్టులు, సామాన్యుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఆయన వెనకడుగు వేయకుండా హైకోర్టులో గళం విప్పుతారు. సమాజంలో అణగారిన వర్గాలకు చట్టం ద్వారా, రక్షణ కల్పించడమే తన బాధ్యతగా ఆయన భావిస్తారు. రాపోలు భాస్కర్ ప్రజల కోసం పోరాడుతూ, తనకంటూ ఒక బ్రాండ్ ను ఏర్పరుచుకున్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments