Homeతెలంగాణభారీ సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు

భారీ సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు

 

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్‌: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం పెట్టిన ఆపరేసన్‌ కగార్‌ డెడ్‌లైన్‌ కొన్నిరోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేతలందరూ ఒక్కక్కరుగా లొంగిపోతున్నారు. ఇటీవల మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి సైతం సరెండర్‌ అయ్యారు. ఇవాళ దేవ్‌జీ అనుచరగణం పీఎల్‌జీఏ సభ్యులు మొత్తం సరెండర్‌ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో సుమారు 120మంది పీఎల్‌జీఏ సభ్యులు జనజీవన స్రవంతిలో కలవనున్నారు. బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో సాయంత్రం 4గంటలకు ఈ కార్యక్రమం ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ లొంగుబాటు రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్దదిగా భావిస్తున్నారు.

తాజావార్తలు