ఏలూరు, క్రైమ్ మిర్రర్:ఆపరేషన్ “వజ్రప్రహార్”లో భాగంగా ఏలూరులో భారీ స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ను పోలీస్ సిబ్బంది, ఈగల్ టీమ్ సభ్యులు ఉమ్మడిగా ఏలూరు వై ఎస్ ఆర్ కాలనీ లో నిర్వహించారు. పోనంగి పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్డన్ సర్చ్‌లో సుమారు 50 సిబ్బంది గురువారం ఉదయం నుంచే ఆయా ప్రాంతాలను చుట్టుముట్టి ప్రతి ఇంటిని , అనుమానాస్పద ప్రదేశాలను తనిఖీ చేశారు.
తనిఖీల్లో వన్ సీఐ సత్యనారాయణ, టుటౌన్సీఐ అశోక్ కుమార్, 3టౌన్‌సీఐ కోటేశ్వర్ రావులు, ఈగల్ టీమ్ ఆర్ ఎస్ఐ ఉదయ భాస్కర్, నలుగురు సబ్ ఇన్స్పెక్టర్లు ఈకార్డన్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్డన్ సర్చ్‌లో సరైనపత్రాలు లేని 14 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసకున్నారు.గంజాయి నిల్వలు, అక్రమ రవాణ, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే అనుమానితులపై నిఘాపెంచినట్లు తెలిపారు.
తనిఖీలు అనంతరం స్థానికులతో మాట్లాడారు. మత్తు పదార్థాల అనర్థాలు గంజాయి వంటి మారకద్రవ్యా ల వల్ల యువత భవిష్యత్ నాశనమవుతుందని తెలిపారు. మత్తుపదర్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైన గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయించిన, నిల్వ చేసిన కఠిన చర్యలు తీసుకుంటానమి తెలిపారు.ఈ తనికీల్లో సుమారు 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
