Monday, March 2, 2026
Homeఅంతర్జాతీయంDonald Trump: ఒకే స్పాట్ లో 48 మంది లీడర్స్ ఖతం.. ఇరాన్ తో చర్చలకు...

Donald Trump: ఒకే స్పాట్ లో 48 మంది లీడర్స్ ఖతం.. ఇరాన్ తో చర్చలకు సిద్ధం: ట్రంప్!

  • ఆపరేషన్ లయన్స్ రోర్ విజయవంతం

  • అమెరికా- ఇజ్రాయేల్ టార్గెట్ ఫినిష్  

  • తమ విజయాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారన్న ట్రంప్!  

అమెరికా, ఇజ్రాయేల్ సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ లయన్స్ రోర్’ విజయవంతమైందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తమ విజయాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారని ఆయన తెలిపారు. తమ సైనిక దాడుల్లో ఇరాన్‌కు చెందిన 48 మంది నాయకులు హతమయ్యారని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. ఖమేనీ సహా పలువురు కీలక నేతలను అంతమొందించామని ట్రంప్ తెలిపారు.

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం

ఇరాన్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తున్న అమెరికా, ఇజ్రాయేల్ ఆ దేశంలోని ప్రధాన నాయకులను అంతం చేస్తున్నాయి. మతాధికారి, ప్రముఖ రాజకీయ నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందగా.. అణు శాస్త్రవేత్తలు, రక్షణ శాఖ అధికారులు.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాము ఇరాన్‌పై గెలిచామని అన్నారు.

మా విజయాన్ని నమ్మలేరు!

“మేము సాధించిన విజయాన్ని ఎవరూ నమ్మలేరు. ఒకేఒక షాట్‌లో ఇరాన్‌లోని 48 మంది ప్రధాన నాయకులు మరణించారు. ఇంకా మా సైనిక దాడులను ఉదృతం చేస్తున్నాం. మేము అనుకున్న షెడ్యూల్ కంటే వేగంగా.. మరింత చురుకుగా ఇరాక్‌లో అమెరికా సైన్యాలు కదులుతున్నాయి”అని ట్రంప్‌ తెలిపారు.

ఇరాన్ తో చర్చలకు సిద్ధం

ఇరాన్‌లోని కొత్త నాయకత్వం ఇప్పటికే వాషింగ్టన్ డీసీతో చర్చలు జరపడం మొదలెట్టిందని, వారితో చర్చలకు తాను ఆమోదం తెలిపానని ట్రంప్  తెలిపారు. ఇరాన్‌లో హింసాత్మక పాలనను అంతమొందించడానికే దాడులు చేస్తున్నామని.. ఇది మాకోసం కాదని.. ప్రపంచం కోసమని ట్రంప్ వెల్లడించారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments