Homeతెలంగాణకాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాడ్గుల మండలం అభివృద్ధి పరుగులు

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాడ్గుల మండలం అభివృద్ధి పరుగులు

•ఎమ్మెల్యే కసిరెడ్డి కి నాయకుల కృతజ్ఞతలు

క్రైమ్ మిర్రర్,రంగారెడ్డి:- కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుండగా, మాడ్గుల మండలం అభివృద్ధి పరుగులు తీస్తోందని నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చొరవతో కోనాపూర్ గేట్ నుండి మాడ్గుల వరకు డబుల్ లైన్ బీటీ రోడ్డు నిర్మాణం ప్రారంభమవడం మండల ప్రజలకు ఊరటనిచ్చిందన్నారు. గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాయితీ అభినందన్ రెడ్డి మాట్లాడుతూ, మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.మాడ్గుల మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రజలు కలిసి ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు