Saturday, February 28, 2026
Homeక్రీడలుఇండియా గెలవదు అంటూ విషం కక్కిన పాకిస్తాన్ బౌలర్?

ఇండియా గెలవదు అంటూ విషం కక్కిన పాకిస్తాన్ బౌలర్?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం సూపర్-8 లో ఉన్నటువంటి జట్లు సెమీఫైనల్స్ కోసం పోరాడుతున్నాయి. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ కు క్వాలిఫై కాగా మరోవైపు భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్ మరియు న్యూజిలాండ్ జట్లు సెమీస్ కోసం పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ సంచలన కామెంట్లు చేశారు. టి20 వరల్డ్ కప్ లో భారత్ సెమీఫైనల్ కు వెళ్ళదు అని మరోసారి టీమిండియా జట్టుపై విషం కక్కారు. గ్రూప్ దశలో పాకిస్తాన్ జట్టుపై తప్ప మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ బ్యాటింగ్ లైన్ అఫ్ కుప్ప కూలిపోయింది అని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా మరియు వెస్టిండీస్ జట్లు చాలా చక్కగా ఆడుతున్నాయి అని ఆ రెండు జట్లు ఎవరినైనా ఓడించగలవు అని చెప్పారు. దీంతో మొదట మీ పాకిస్తాన్ జట్టు ఈరోజు ఓడిపోకుండా చూసుకోండి అంటూ భారత క్రికెట్ అభిమానులు అందరూ కూడా మహమ్మద్ అమీర్ కు సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఏ జట్టు కప్ నెగ్గుతుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.

విరోష్ పెళ్లి.. ధరించిన నగల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

రూ.9.34 లోన్ చెల్లించాలంటూ రైతుకు నోటీసులు.. బ్యాంక్ అధికారులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రైతు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments