క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- సినిమా నటులు విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన ఇద్దరూ కూడా రాజస్థాన్‌లోని ఉదయపూర్ లో చాలా ఘనంగా వివాహం చేసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ వివాహంలో విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన ఇద్దరు కూడా చాలా సింపుల్ గా రెడీ అయ్యి అందంగా కనిపించే నగలతో అలంకరించుకోవడం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా అంతటా కూడా వీరిద్దరూ ధరించిన నగల విలువ ఎంత ఉంటుంది అని ఆరా తీస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వీరి నగలు విలువకు సంబంధించిన సమాచారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకవైపు విజయ్ దేవరకొండ మరోవైపు రష్మిక మందన కు సంబంధించి నగలను హైదరాబాదుకు చెందినటువంటి ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ దాదాపు పది నెలల పాటు కష్టపడి డిజైన్ చేసింది అట. రష్మిక వడ్డానం, మంగళసూత్రం, గాజులు, నెక్లెస్ ఇలా దాదాపు 11 రకాల నగలు బరువు 1.5 నుంచి రెండు కేజీల వరకు ఉంటాయి అని జాతీయ మీడియా తాజాగా ప్రకటించింది. ఇక ఈ రెండు కేజీల వరకు ఉన్నటువంటి బంగారం విలువ దాదాపు మూడు నుంచి ఐదు కోట్ల వరకు ఉంటుంది అని సమాచారం. మరోవైపు విజయ్ దేవరకొండ సైతం అరకేజీ బరువైన నగలు ధరించగా దాని విలువ అక్షరాల ఒకటి నుంచి రెండు కోట్ల వరకు ఉంటుంది. పెళ్లి కోసం వీరిద్దరూ విలువైన వజ్రాలు, స్పెషల్ డిజైనింగ్ తో చేయించడంతోనే వీటి ధర పెరిగినట్లు సమాచారం.
రూ.9.34 లోన్ చెల్లించాలంటూ రైతుకు నోటీసులు.. బ్యాంక్ అధికారులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రైతు
మారువేశంలో చెకింగ్‌కు వెళ్లిన కలెక్టర్.. అసలు విషయం తెలియక సిబ్బంది దురుసు ప్రవర్తన
