Homeతెలంగాణలైఫ్ ఇన్సూరెన్స్ భీమా చెక్కు అందజేత

లైఫ్ ఇన్సూరెన్స్ భీమా చెక్కు అందజేత

కుటుంబానికి ఆర్థిక రక్షణ జీవిత భీమా : బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్

క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- మనిషి జీవితంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. తమ తర్వాత తమ కుటుంబం రోడ్డున పడకూడదని భావించేవారు తప్పకుండ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని మహాదేవపూర్ మండలం సూరారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ అన్నారు. మండలంలోని అంబట్ పల్లి గ్రామానికి చెందిన సంబరాతి సారయ్య గత కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు, అయితే మరణించే ముందు సారయ్య తమ ఆర్థిక లావాదేవీలా కోసం సూరారం గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో ఖాతా ఉపయోగించుకునేది ఇదే క్రమంలో ఇన్సూరెన్స్ అధికారి సలహాతో పది లక్ష రూపాయల జీవిత బీమా పాలసీ తీసుకొని కొంత మొత్తాన్ని పాలసీ ప్రీమియంగా చెల్లించారు. అనంతరం కొంతకాలనికి సారయ్య ఆకస్మికంగా మృతి చెందడంతో భీమా నిర్దిష్ట మొత్తం పది లక్షల రూపాయల చెక్ వారి కుటుంబ సభ్యులకు బ్రాంచ్ మేనేజర్ జి శ్రీనివాస్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ ఆఫీసర్ సందీప్, మరియూ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

సర్కారు చేతికి మెట్రో రైలు

ప్ర‌పంచంలోనే నంబ‌ర్ వ‌న్ నేత‌గా న‌రేంద్ర‌మోడీ

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు