Homeక్రైమ్జుబ్లీహిల్స్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం

జుబ్లీహిల్స్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం

  • షోరూం నుంచి ఎగ‌సి పడుతున్న మంట‌లు
  • క‌మ్ముకున్న ద‌ట్ట‌మైన పొగ‌
  • భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ ,క్రైమ్ మిర్ర‌ర్: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో భారీ అగ్నిప్రమాదం సంభ‌వించింది. మంగళగౌరి షోరూంలో మంటలు, చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్న పడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అప్ర‌మ‌త్త‌మైన షాపు సిబ్బంది బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.

స‌మాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలపు అదుపులోకి తెస్తున్నారు. ముందుగా మంటలు షోరూమ్ బయట చెట్టుకు అంటుకున్నట్లు సమాచారం. . మంటలు భారీగా చెలరేగడంతో పక్కనున్న షాపులకు కూడా అంటుకున్నాయి.

వెల్డింగ్ పనులు చేస్తుండగా, మంటలు అంటుకున్నట్లు సమాచారం. మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం అయ్యారు. కాగా షాపులో ఉన్న వ‌స్త్రాలు, ఫ‌ర్నీచ‌ర్ పూర్తిగా దగ్ద‌మైంది. ద‌ట్ట‌మైన‌పొగ‌లు మంట‌ల‌తో జుబ్లీహిల్స్ రోడ్ నెంబ‌ర్ 36లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికైతే ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌రుగ‌లేద‌ని యాజ‌మాన్యం తెలిపింది.

తాజావార్తలు