- రెండో స్థానంలో ట్రంప్
న్యూఢిల్లీ క్రైమ్ మిర్రర్: ప్రపంచంలోనే కనువినీ ఎరుగని రీతిలో ఇన్‌స్టాలో వంద మిలియన్ ఫాలోవర్లతో నంబర్‌వన్ నేతగా రికార్డు సృష్టించాడు. కాగా 2014 లో ప్రధాని మోడి తొలిసారిగా ఇన్‌స్టాలో చేరాడు. ఆయన యువతరానికి కనెక్ట్ కావడంతో పాటు సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది.
ఫాలోవర్ల సంఖ్యాపరంగా ప్రధాని మోదీ తరువాతి స్థానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. ఆయనను ఇన్‌స్టాలో ఫాలో అయ్యే వారి సంఖ్య 43.2 మిలియన్లు.
ఆ తరువాతి స్థానాల్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబొవో సుబియాంతో (15 మిలియన్ ఫాలోవర్లు), బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా (14.4 మిలియన్ ఫాలోవర్లు), తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్ (11.6 మిలియన్ ఫాలోవర్లు), అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ (6.4 మిలియన్ ఫాలోవర్లు) ఉన్నారు.
ట్రంప్‌తో పాటు ఆ తరువాత నాలుగు స్థానాల్లో ఉన్న నేతల ఫాలోవర్లు సంఖ్యను కూలిపి చూసినా ప్రధాని మోదీ కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. ఇక భారతీయ నేతల్లో కూడా ఫాలోవర్ల సంఖ్యాపరంగా ప్రధాని నెం.1గానే ఉన్నారు.
ప్రధాని తరువాతి స్థానంలో ఉన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు 16.1 మిలియన్ ఇన్‌స్టా ఫాలోవర్లు ఉండగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఉన్న ఫాలోవర్ల సంఖ్య 12.6 మిలియన్లుగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడి సోషల్ మీడయాలో నిత్యం యాక్టివ్ ఉంటూ అధికారిక కార్యక్రమాలు, అంతర్జాతీయ పర్యనలు రాజకీయాలకు సంబంధించిన ఫొటోలు ఇనష్టాలో పంచుకుంటారు.

