Homeఅంతర్జాతీయందిగొస్తున్న బంగారం ధరలు

దిగొస్తున్న బంగారం ధరలు

  • శుభకార్యాలు చేసుకునేవారికి కొంత ఊరట
  • గడిచిన రెండు రోజుల్లో రూ.2,840 తగ్గుదల

హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: వివాహాది శుభకార్యాల సీజన్ మొదలైన వేళ బంగారం ధరలు స్వల్పంగా దిగి వస్తున్నాయి. దీంతో శుభకార్యాలు,పెళ్లీలు చేసేవారి కుటుంబాలకు కొంత ఉపశనమనే చెప్పవచ్చు. గత కొన్ని నెలలుగా బంగారం ధరలకు రెక్కలు వచ్చినట్టు పెరిగిపోయాయి, సామాన్య, మధ్య తరగతి వారు బంగారం కొనాలంటేనే వణికిపోయేపరిస్థితి ఏర్పడింది.

రోజు రోజుకు బంగారం ధరలు పెరిగిపోవడంతో కట్నకానుకల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ధరలు పెరుగుదల వల్ల కొనుగోలుదారులు తులం, అర తులంతోనే సరిీపెట్టుకుంటున్నారంటే బంగారంకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాగా గడిచిన రెండు రోజులుగా బంగారంధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో బంగారం కొనుగోలుల‌కు కొంత ఉపశమనమనే చెప్పచ్చు.

తెలుగు రాష్ట్రాలో తగ్గిన బంగారం ధరలు…
అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలుగు రాష్టాల్లో బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధరపై ఏకంగా రూ.1,530 తగ్గి రూ.1,54,910 వద్ద కొనసాగుతోంది.

గడచిన రెండు రోజుల్లో రూ.2,840 మేర ధర తగ్గడం విశేషం. ఇక అభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.1,400 తగ్గి రూ.1,42,000కు చేరింది. కాగా వెండి ధర కూడా భారీగా పతనమై కేజీ ధర రూ.2,65,000 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 5 వేల డాలర్ల మార్కు నుంచి 4,930 డాలర్ల స్థాయికి పడిపోవడంతో దేశీయంగా కూడా ధరలు దిగొచ్చాయి. దానికి తోడు డాలర్ విలువలో మార్పులు కూడా బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి.

తాజావార్తలు