HomeజాతీయంVande Mataram: వందేమాతరం కొత్త ప్రోటోకాల్.. ఎప్పుడు ఆలపించాలంటే?

Vande Mataram: వందేమాతరం కొత్త ప్రోటోకాల్.. ఎప్పుడు ఆలపించాలంటే?

New  Vande Mataram Guidelines: జాతీయ గేయం వందేమాతరం ఆలాపనపై కొత్త నిబంధనలను కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం  అలపించాలి. అధికారిక కార్యక్రమాలు, వేడుకల్లో తొలుత 3 నిమిషాల 10 సెకన్ల పాటు వందేమాతరం 6 చరణాలను ఆలపించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ప్రకటించిన వందేమాతరం కొత్త ప్రోటోకాల్‌‌   అమల్లోకి వచ్చింది.

వందేమాతరం ఎప్పుడు పాడాలి?

ఈ నిబంధనల ప్రకారం, వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలి. పౌర పురస్కారాలు, రాష్ట్రపతి, గవర్నర్లు పాల్గొనే అన్ని కార్యక్రమాల్లోనూ వందేమాతరం ఆలపించాలి. సినిమా హాళ్లలో దీన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. జాతీయ గీతం, జాతీయ గేయం ఆలపించేటప్పుడు అంతరాయం కలిగిస్తే బాధ్యులకు మూడేళ్ల వరకూ జైలుశిక్ష పడుతుంది. స్కూళ్ల కార్యక్రమాలు తప్పకుండా వందేమాతరం కార్యక్రమంతో మొదలు కావాలి. ఇందుకోసం పాఠశాలల నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలి. కాగా, ప్రత్యేక కార్యక్రమాలు, వేడకల్లో వందేమాతరం ఆలాపన చేయాలని అనుకుంటే తగిన ఆడియో సిస్టమ్‌ను సమకూర్చుకోవాలి. అవసరమైతే గేయం ఆలాపనకు వీలుగా ఆరు చరణాలతో కూడిన కరపత్రాలను కార్యక్రమానికి హాజరైన వారికి పంపిణీ చేయవచ్చు.

వందేమాతర గేయం 150 వసంతాల వేడుకలు

దేశభక్తి, మాతృభూమిపై ప్రేమతో మర్యాదపూర్వకంగా సముచితమైన పద్ధతిలో ఏ కార్యక్రమంలో నైనా వందేమాతరం ఆలపించవచ్చని కేంద్రం తెలిపింది. వందేమాతర గేయం 150 వసంతాల వేడుకలను కేంద్ర నిర్వహిస్తున్న వేళ ఈ మార్గదర్శకాలను విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments